
Andhra Pradesh Gold Mines: భారతదేశంలో ప్రస్తుతం అనేక బంగారు గనులు బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే అందులో కొన్ని గనులు ఇప్పటికే బంగారం ఉత్పత్తి నిలిచిపోగా.. ఇప్పుడు మరో బంగారు గని బయటపడింది.
అది కూడా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో. దేశంలో తొలిసారి బంగారు గనులను లీజుకు ఓ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం గమనార్హం. జొన్నగిరి గోల్డ్ మైన్ నుంచి ఏడాదికి 750 కిలోల నుంచి 1000 కిలోల వరకు బంగారాన్ని వెలికితీసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.