
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Samantha Is Back: దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు సామ్ స్టార్ పవర్‌తో వసూళ్లు దక్కుతున్నాయి. తెలుగు సహా ఇతర భాషల్లో ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినట్టు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదనే చెప్పాలి. అంతేకాదు ఓ మిడియం రేంజ్ హీరో కన్నా.. సమంత సినిమాకు మంచి వసూల్లు దక్కుతున్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమాకు అనుకున్న దాని కంటే ఎక్కువ వసూల్లు వస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఈ రేంజ్ వసూళ్లు దక్కడం మాములు విషయం కాదంటున్నారు ట్రేడ్ పండితులు.
అంతేకాదు ఈ ‘మా ఇంటి బంగారం’ సినిమాతో సమంత మరోసారి అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఆదివారం నాటికి యూఎస్‌లో కలెక్షన్లు 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటే అవకాశాలున్నట్టు యూఎస్ ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇదే జరిగితే 17వ ‘వన్ మిలియన్ డాలర్ క్లబ్’ సినిమాలో చేరే ఏకైక సౌత్ ఇండియన్ హీరోయిన్గా సమంత హిస్టరీ క్రియేట్ చేయనున్నారు. దూకుడు నుంచి మొదలు పెడితే..‘మా ఇంటి బంగారం’ వరకు యూఎస్ బాక్సాఫీస్ అత్యధిక $1M డాలర్ సినిమాల హీరోయిన్గా సామ్ పేరిట సరికొత్త రికార్డు నమోదు కానుంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
సామ్ విషయానికొస్తే.. ఆ మధ్య నాగ చైతన్యతో విడాకుల తర్వాత కొన్నాల్లు ఓ వింత వ్యాధితో బాధపడింది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, సిటాటెల్ దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ డీకేల్లో రాజ్ నిడుమూరును ప్రేమ వివాహాం చేసుకుంది. తాజాగా విడుదలైన ‘మా ఇంటి బంగారం’ సినిమాకు ఈయనే కథ అందించాడు. మొత్తంగా రెండో పెళ్లి తర్వాత విడుదలైన ఈ సినిమాతో సమంత పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. అంతేకాదు ఈ రోజు ఈ సినిమా గంటకు 15 వేల టికెట్స్ సేల్ అవుతున్నాయి. ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి ఇది పెద్ద వసూళ్లనే చెప్పాలి. ఈ సినిమాను అన్ని ఏరియాల్లో ఓన్‌గా రిలీజ్ చేసుకున్నారు. ఇప్పటికే నాన్ థియేట్రికల్‌గా రూ. 40 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ అందుకున్న ఈ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుందని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.