
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Russia Ukraine Drone Attack: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం సరికొత్త వ్యూహాత్మక మలుపు తిరిగింది.. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా ఉక్రేన్ సైన్యం శత్రుదేశంపై మునుపేన్నడు లేనివిధంగా అత్యంత సుదూర పరిధి నుంచి విధ్వంసకర దాడికి తెగబడింది.. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి ఏకంగా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యకు గుండెకాయ లాంటి యురల్స్ (Urals) ప్రాంతంలో ఉన్న ట్యూమెన్ ఆయిల్ రిఫైనరీ ఫై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా భూభాగంలో ఇంత సుదూర ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక కేంద్రాన్ని ఉక్రెన్ టార్గెట్ చేయడం అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తుంది..
ఆయిల్ రిఫైనరీలే టార్గెట్.. రష్యాకు భారీ నష్టం.. గత కొంతకాలంగా రష్యాకు చెందిన చమురు నిల్వలతోపాటు ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా వుక్రీన్ వరస దాడులకు పాల్పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా రష్యాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీలో ఒకటైన Tyumen ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా చేదించాయి.. అత్యంత ప్రతిష్టమైన రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ దాటుకుంటూ వెళ్లిన ఈ డ్రోన్లు రిఫైనరీ సమీపంలోని పేలిపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడితో రష్యా ఇంధన సరఫరాకు భారీ నష్టం కలిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి రష్యా భూభాగంపై తాము సాధించిన ఈ సుదూర డ్రోన్ దాడి పై ఉక్రెయిన్ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదొక అద్భుతమైన, గొప్ప విజయమని ఆయన అభివర్ణించారట.. శత్రువు మాపై దాడులు చేస్తూ సురక్షితంగా ఉంటాం అనుకుంటే అది పొరపాటేనని.. రష్యా భూభాగంలో ఏ మూలన దాక్కున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. వారి రక్షణ రంగ ఇంజనీర్లు రాత్రి పగళ్ళు శ్రమించి అత్యంత అధునాతన సాంకేతికతతో సరికొత్త లాంగ్ రేంజ్ డ్రోన్లను అభివృద్ధి చేశారని.. ఇవి ఏకంగా మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలమని జెలన్స్ కి తెలిపారు..
3,000 కి.మీ రేంజ్ డ్రోన్లతో రష్యాకు కొత్త ముప్పు.. బుక్ గ్రీన్ సరికొత్తగా తయారుచేసిన ఈ లాంగ్ రేంజ్ డ్రోన్లు రష్యా సైన్యానికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.. సాధారణంగా చిన్న పరిధిలో పనిచేసే డ్రోన్ల స్థానంలో.. వేల కిలోమీటర్లు ప్రయాణించి వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంది. 3000 కిలోమీటర్ల పరిధి అంటే కేవలం సరిహద్దు ప్రాంతాలే కాకుండా.. రష్యాలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాలతో పాటు పారిశ్రామిక కేంద్రాలు ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్ల నిఘా నీడలొకి వచ్చినట్లేనని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు..
ఆందోళనలో రష్యా.. సరిహద్దుకు అత్యంత దూరంలో ఉన్న ప్రాంతంపై దాడి జరగడంతో మాస్కో వర్గాలు తీవ్ర దిబ్రాంతుకు గురైనట్లు సమాచారం.. ఈ డ్రోన్ దాడితో రష్యా తన అంతర్గత రక్షణ వ్యవస్థను పునర్సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఒకవైపు అంతర్జాతీయ ఆంక్షలుతో సతమతమవుతున్న రష్యాకు.. ఈ ఆయిల్ రిఫైనరీ లపై దాడులు మరింత ఆర్థిక నష్టాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఈ ఘటనతో రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య దాడులు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.