
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Team India ODI Squad Vs England: జూలైలో ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. చాలా రోజుల తర్వాత వన్డే జట్టులో కోహ్లీకి అవకాశం కల్పించగా.. అయితే ఈ నెలాఖరులో జరిగే ఫిట్నెస్ పరీక్షలో అతను నెగ్గాల్సి ఉంటుంది. తాజాగా బీసీసీఐ ప్రకటించిన వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తుండగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా జట్టు జూలై 14 నుంచి 19 వరకు మూడు వన్డేలు ఆడనుంది.
బీసీసీఐ ప్రకటించిన వన్డే జట్టులో ఎవరెవరు ఉన్నారంటే? శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ఫిట్నెస్ పరీక్ష నెగ్గాలి), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
గత నెల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విరాట్ కోహ్లీ.. ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీకి'హామ్‌స్ట్రింగ్' గాయం బారిన పడ్డాడు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ వేగంగా కోలుకుంటున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. లండన్‌లో BCCI వైద్య బృందం అతన్ని పరీక్షించి, పునరావాస ప్రక్రియలో ప్రాథమిక దశను కొనసాగించడానికి ఒక ప్రణాళికను అందించింది. తదుపరి పరిశీలన, ప్రణాళిక, అనుమతి కోసం అతను జూన్ 22, 2026న CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో రిపోర్ట్ చేయనున్నారు.
జైస్వాల్, హార్దిక్‌లకు చోటు లేదు ఆఫ్ఘనిస్తాన్‌తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కోహ్లీ దూరమయ్యాడు. ఆ సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కోహ్లీ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌కు అవకాశం లభించింది. ఈ యువ లెఫ్ట్-హ్యాండ్ బ్యాటర్ ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని, జూన్ 20 శనివారం నాడు చెన్నైలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల వన్డే జట్టులో యశస్వికి చోటు దక్కలేదు.
గాయం సమస్యల నుండి ఇంకా కోలుకుంటున్నందున హార్దిక్ పాండ్యాను ఈ వన్డే పర్యటనకు ఎంపిక చేయలేదు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో పూర్తి ఫిట్‌గా ఉండేందుకు ఇబ్బంది పడిన ఈ ఆల్‌రౌండర్, ఈ నెల ప్రారంభంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ తీసుకుంటుండగా క్వాడ్రిసెప్స్ కండరాల గాయానికి గురయ్యాడు. అతని గైర్హాజరీలో, నితీష్ కుమార్ రెడ్డి ప్రధాన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడు.
శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా తన స్థానాన్ని నిలుపుకోగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్‌కు అవకాశం కల్పించేందుకు ఓపెనింగ్ స్థానాన్ని ఖాళీ చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బ్యాటింగ్ ఆర్డర్లో తిరిగి ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. లక్నోలో ఆఫ్ఘనిస్తాన్పై 125 పరుగులు చేసి తనదైన ముద్ర వేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
బుమ్రా పునరాగమనం ఆఫ్ఘనిస్తాన్ వన్డేలకు, యూకే పర్యటనలోని టీ20లకు (ఐర్లాండ్‌తో మూడు టీ20లు, ఇంగ్లాండ్‌తో ఐదు) విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా, వన్డే జట్టులోకి తిరిగి రానున్నాడు. 2027 ప్రపంచకప్‌కు ముందు బుమ్రా టెస్ట్ క్రికెట్ ఆడి, వన్డేలపై దృష్టి పెట్టాలన్న ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉంది.
బుమ్రాకు పూర్తిస్థాయి పేస్ బౌలింగ్ దళం అందుబాటులో ఉంటుంది. ఇందులో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాతో పాటు, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తన తొలి వన్డే సిరీస్‌లో ఏడు వికెట్లతో ఆకట్టుకున్న కొత్త ఆటగాడు గుర్నూర్ బ్రార్ కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్‌కు జట్టు నుంచి మినహాయింపు లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.