
Strait Of Hormuz Closed: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని అమలు చేయడంపై చర్చల కోసం ఇరాన్, అమెరికా ప్రతినిధులు స్విట్జర్లాండ్లో సమావేశం కావడానికి సిద్ధమవుతున్న తరుణంలో..
లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని శనివారం మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల్లో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించిన తర్వాత.. లెబనాన్లో ఇజ్రాయెల్ వరుస దాడులు జరపడంతో, శుక్రవారం స్విట్జర్లాండ్లో తదుపరి చర్చలు జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి.