
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
History behind International yoga day june 21: ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సంను ఎంతో ఉల్లాసంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా యోగా ఆసనాలు వేసి ఒక స్పూర్తివంతంగా యోగాను నిర్వహించుకున్నారు. మన దేశంలో త్రివిధ దళాల సిబ్బందితో పాటు ప్రధాని మోదీ సైతం సైతం యోగాసనాలు వేసి దేశ ప్రజలను మరింత ఉత్సాహ పరిచారు. ఈ క్రమంలో ఈసారి యోగాను "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా".. అనే థీమ్ తో జరుపుకున్నాం. అంతర్జాతీయ యోగ దినోత్సవంను ప్రతి ఏటా జూన్ 21 వ రోజున జరుపుకుంటాం.
యోగా ప్రాధాన్యత గురించి భారతదేశపు ప్రాచీన సంస్కృతిలో కూడా చెప్పారు. మన దేశపు పురాణ రుషులు, మునులు యోగా అభ్యాసం చేశారు. అంతే కాకుండా అనేక తాళపత్ర గ్రంథాల రూపంలో తర్వాతి తరాలకు అందజేశారు. యోగా వల్ల శారీరక ,మానసిక ఆరోగ్యం పెంపొందుతుంది. శరీరంలోని జీవక్రియలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఏకాగ్రత పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా దరిచేరవు. ఈ క్రమంలో ఇటీవల మారిపోయిన జీవన ప్రమాణాలు, ఆహరపు అలవాట్ల, జీవగడియాం పూర్తిగా దెబ్బతినడం వల్ల చాలా మంది అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వీటినుంచి బైటపడేందుకు నిపుణుల సూచనల మేరకు యోగా ఆసనాలు వేస్తున్నారు. ప్రతిరోజు యోగాకు కొంచెమైన సమయం కేటాయించి అనేక సమస్యల నుంచి రిలీఫ్ ను పొందుతున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. అంతే కాకుండా.. యోగాను అంతర్జాతీయంగా గుర్తించాలని చేసిన ప్రతిపాదనకు ప్రపంచంలోని 177 దేశాలు మద్దతు తెలిపాయి. ఆ తర్వాత, ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఆతర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవంను తొలిసారిగా జూన్ 21, 2015న జరుపుకున్నారు. దీని వెనుక మరో కారణం కూడా ఉంది.
Read more: Yoga Vs Walking: యోగా Vs నడక ఏది ఉత్తమం? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
జూన్ 21న ఇది ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలో అత్యంత పొడవైన రోజు, దీనిని "వేసవి అయనాంతం" అని పిలుస్తారు. ఈ రోజునే సూర్యరశ్మి ఎక్కువగా భూమిపై ప్రసారం అవుతుంది. ఈ సమయంలో యోగా చేయడం వల్ల శరీరంకు మానసిక ఉల్లాసం, ఏకాగ్రత లభిస్తుంది. ముఖ్యంగా అనే రకాల ఒత్తిడిలను దూరం చేసి ఆరోగ్యంను మెరుగు పరుస్తుంది. అందుకే ప్రతి ఏటా జూన్ 21ను యోగాను జరుపుకుంటూ వస్తున్నాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.