
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Rythu Bharosa Funds Release On June 30: రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు ఊపు అందుకుంటున్న సమయంలో రైతందానికి పెట్టుబడి సహాయం అందించే రైతు రైతు భరోసా నిధుల పంపిణీ పై అన్నదాతల్లో ఉత్కంఠ నెలకొంది.. ఈనెల 30వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో వానాకాలం పెట్టుబడి సాయం నిధులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.. అయితే ప్రస్తుతం ఏకరానికి ఏడాది రూ.12 వేల చొప్పున అందుతుండడంతో.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి 15వేల సాయం ఎప్పటి నుంచి అందుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం ఎదురుచూస్తూ వస్తోంది..
జూన్ 30న మధిర సభలో నిధుల విడుదల.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు.. జూన్ 30వ తేదీన ఖమ్మం జిల్లాలోని మధిరలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి ఈ నిధుల పంపిణీని అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో దాదాపు పది రోజుల వ్యవధిలోనే నేరుగా ఈ పెట్టుబడి సాయాన్ని జమ చేసేందుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం..
రూ.15 వేల పెంపుపై అన్నదాతల ప్రశ్నలు.. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల్లో ఒకే ఒక అంశంపై ప్రధానంగా చర్చ నడుస్తూ వస్తోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరానికి ఏడాదికి ఏకంగా 15000కు పెంచుతామని హామీ ఇచ్చింది.. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైన.. పాత పద్ధతిలోనే ఎకరానికి 6000 చొప్పున 12000 మాత్రమే జమయ్యే అవకాశాలు ఉండడంతో రైతులు కొంత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు..
పెంచిన 15వేల సాయాన్ని ఈ వానాకాలం నుంచి వర్తింప చేస్తారా? లేక తదుపరి యాసంగి సీజన్ నుంచి అమలు చేస్తారా? అనే విషయంపై స్పష్టత కరువైంది.. ప్రస్తుతం ఎరువులతో పాటు విత్తనాలు, దుక్కుల ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో సాగు పెట్టుబడుల కోసం రైతులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో పెంచిన సాయం త్వరగా అందితే తమకు మరింత ఊరట లభిస్తుందని కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో చిన్న సన్న కారు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
రైతుల డిమాండ్.. ప్రభుత్వం జూన్ 30 నుంచి ఇచ్చే నిధులతో పాటు పెంచిన 15 వేల సాయం అమలుపై కూడా తక్షణమే ఒక అధికారిక ప్రకటన చేయాలని.. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు.. కౌలు రైతుకు ఈ సాయం అందేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతున్నారు. ఖాతాల్లో నిధులు జమావుతున్నప్పటికీ వారు సంతోషించినప్పటికీ.. పెరిగిన సాయం ఎప్పటినుంచి చేతికి అందుతుందో తెలియక.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది అన్నదాతలు ఇప్పుడు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.