క్యాన్సర్ రిస్క్ను తగ్గించే ఆహారాలు
క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్ తింటే ఓవరాల్ హెల్త్‌ మెరుగుపడుతుంది. క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుంది.
క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్ తింటే ఓవరాల్ హెల్త్‌ మెరుగుపడుతుంది. క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుంది.
కొందరు ఉడకబెట్టిన గుడ్లు చల్లారితే.. వాటిని వేడి చేసి తింటూ ఉంటారు. అయితే ఉడికించిన గుడ్డును దాని పెంకుతో పాటు మైక్రోవేవ్లో ఎప్పుడూ మళ్లీ వేడి చేయకూడదు. గుడ్డు లోపల ఆవిరి పేరుకుపోవచ్చు, వేడిగా ఉన్న గుడ్డును బయటకు తీసి పగలగొడితే అది పేలే ప్రమాదం ఉంది. మీరు ఉడికించిన గుడ్డును వేడి చేయాలనుకుంటే, ముందుగా దాని పెంకు తీసి ముక్కలుగా కోసి, ఆ తర్వాత నెమ్మదిగా వేడి చేయండి. మైక్రోవేవ్లో గుడ్డు వంటకాలను వేడి చేస్తున్నప్పుడు అవి సమానంగా వేడెక్కేలా చూసుకోవడానికి వాటిపై మూత పెట్టండి, వాటిని తిప్పండి లేదా కలపండి. సాంబార్, గ్రేవీ, కూర, పాస్తా సాస్ వంటి చిక్కగా ఉండే ఆహారాల్లో మైక్రోవేవ్ వేడి ఒకేలా చేరకపోవచ్చు. ఒక చోట చల్లగా ఉంటే మరో చోట చాలా వేడిగా ఉండొచ్చు. అందుకే పాత్రను కవర్ చేసి కొద్దిసేపు వేడి చేసిన తర్వాత బయటకు తీసి బాగా కలపాలి. అవసరమైతే మళ్లీ కొద్దిసేపు వేడి చేయాలి. కొందరు పచ్చిమిర్చిని కట్ చేయకుండా దాన్ని అలానే వేడి చేస్తూ ఉంటారు. మొత్తం పచ్చిమిర్చిని మైక్రోవేవ్లో వేడి చేస్తే వాటిలోని క్యాప్సైసిన్ అధికంగా ఉండే నూనెలు ఆవిరైపోయి, కారం పదార్థం నుంచి వచ్చే ఆవిరి ముక్కు, కళ్లకు ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే మొత్తం మిర్చిని నేరుగా వేడి చేయకుండా చిన్న ముక్కలుగా కోసి కూర లేదా ఇతర ఆహారంలో కలిపి వేడి చేయడం మంచిది. అన్నం విషయంలో మైక్రోవేవ్ కంటే దాన్ని ఎలా నిల్వ చేశామన్నదే చాలా ముఖ్యం. ఉడికించిన అన్నాన్ని ఎక్కువసేపు బయట ఉంచితే బ్యాసిల్లస్ సీరస్ అనే బ్యాక్టీరియా పెరిగి సమస్యలు కలిగించే టాక్సిన్లు తయారయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మైక్రోవేవ్లో వేడి చేసినా ఆ టాక్సిన్లు పూర్తిగా పోతాయని చెప్పలేము. అందుకే మిగిలిన అన్నాన్ని వీలైనంత త్వరగా ఫ్రిజ్లో పెట్టాలి. పకోడీలు, సమోసాలు, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి
చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్స్, కేక్స్, క్యాండీలు, జెల్లీలు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే ఈ షుగర్ ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు. కొంతమంది గాయాలు మానేందుకు పాలు లేదా టీలో బ్రెడ్ వేసుకుని తింటారు. కానీ వైట్ బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవెల్స్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. అందుకే గాయాలు తగ్గాలంటే వైట్ బ్రెడ్ బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్ తినడం మంచిది. కూల్ డ్రింక్స్, సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచుతాయి. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. ప్రాసెస్ చేసిన బేకాన్, హాట్ డాగ్, సలామీ వంటివి తింటే గాయానికి రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. ఉప్పు, సోడియం ఎక్కువగా ఉండే చిప్స్ వంటి ప్యాకేజీ ఐటెమ్స్ తినడం వల్ల రక్తపోటు సమస్య ఉత్పన్నమవుతుంది. అలాగే గాయాలు మానడం కూడా ఆలస్యం అవుతుంది టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీని డీహైడ్రేట్ చేసి గాయాలు మానడం ఆలస్యం చేస్తుంది. అందుకే గాయం మానాలంటే కెఫిన్ తక్కువగా తీసుకోవాలి. సాస్లో సోడియం, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును మరింత పెంచుతాయి. అందుకే గాయాలు మానాలంటే ఈ సాస్ లాంటి పదార్థాలు తినకూడదు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే గాయాలు మానడం కోసం ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది
బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ప్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్తో పాటుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మంట, వాపును తగ్గిస్తాయని హెల్త్లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును కంట్రోల్ చేస్తాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్, పొటాషియం కూడా లభిస్తుంది. ఇవి ఇన్ఫ్లమేషన్ను కంట్రోల్ చేస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గ్రీన్ టీ తాగితే మంట, వాపు నుంచి రక్షణ లభిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. పసుపును వివిధ రూపాల్లో తీసుకుంటే మంట వాపు, తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్లో ఓలియోకాంథాల్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మంట, వాపు తగ్గుతుంది. డార్క్ చాక్లెట్లో ప్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును కంట్రోల్ చేస్తాయి. డార్క్ చాక్లెట్ తింటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్తో పాటుగా విటమిన్ సి, పొటాషియం ఉంటుంది. టమాటాలు తింటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. పాలకూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్లో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుకూరలు తింటే వాపు, మంట తగ్గుతుంది
బాదం గింజల్లో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచి చదివింది బాగా గుర్తుండేందుకు సహాయపడతాయి. మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్నట్స్ జ్ఞాపకశక్తిని పెంచేందుకు సహాయపడతాయి. పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ వాల్నట్స్ తింటే చదివింది బాగా గుర్తు ఉంటుంది. నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి నరాల పనితీరును బాగుచేస్తాయి. మెదడును చురుకుగా ఉంచి చదివింది బాగా గుర్తుండేందుకు సహాయపడతాయి. అయితే మితంగా తీసుకోవడం మంచిది. పల్లీల్లో నియాసిన్, రెస్వెరట్రాల్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండింటితో తయారుచేసే చిక్కీలు తినడం ద్వారా జ్ఞాపకశక్తి బాగుంటుంది. పాలకూర, తోటకూర, మునగాకు, మెంతి ఆకులు వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ కె వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మఖానాలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. నెయ్యిలో తేలికగా వేయించిన ఈ మఖానా స్నాక్ రూపంలో తీసుకుంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి మెదడు కణాలను రక్షిస్తుంది. అందుకే ఉసిరిని డైట్లో చేర్చుకోవడం ద్వారా జ్ఞాపశక్తి బాగుంటుంది. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు చురుకుగా ఉంచేందుకు సహాయపడతాయి. తద్వారా చదివింది బాగా గుర్తుంటుంది. రాగాలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు లాంటి చిరు ధాన్యాల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మీ శక్తిని ఎక్కువసేపు తగ్గకుండా కాపాడి మెదడును చురుకుగా ఉంచుతాయి
30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఎముకలు బలహీనపడుతూ వస్తాయి. దీంతో తరచూ ఎముకల నొప్పి వేధిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువగా ఉండే గింజలు, విత్తనాలు డైట్లో చేర్చుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో 30 ఏళ్లలోనూ ఎముకలను బలంగా ఉంచే ఆ గింజలు ఏంటో తెలుసుకుందాం. అన్ని గింజలతో పోలిస్తే బాదం గింజల్లో కాల్షియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వయసు పెరిగినా ఎముకలు బలంగా ఉండాలంటే రోజూ నాలుగైదు బాదం గింజలు నానబెట్టి తినడం చాలా మంచిది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఫాస్పరస్ ఎక్కువగా లభిస్తాయి. రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తినడం ద్వారా ఎముకలు పెలుసుబారకుండా చూసుకోవచ్చు. నువ్వుల్లో ఎముకల బలానికి సహాయపడే కాల్షియం, జింక్ ఎక్కువగా లభిస్తాయి. అందుకే పిల్లలతో పాటు పెద్దలు ఎముకలు బలానికి నువ్వులతో చేసిన ఆహారాలు తినడం చాలా మంచిది. చియా సీడ్స్లో కాల్షియంతో పాటు ఫాస్పరస్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. వాల్నట్స్లో హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతాయి. అవిసె గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ తగ్గించి ఎముకలను బలంగా ఉంచుతాయి. పిస్తా గింజల్లో విటమిన్ బి6, పొటాషియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రోజూ గుప్పెడు పిస్తా గింజలు తింటే ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. పొద్దుతిరుగుడు గింజల్లో మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఇ వంటి ఆవశ్యక పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను హెల్తీగా ఉంచుతాయి
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో అన్ని రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రొమ్ము క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. బ్రోకలీ, క్యాబేజీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్లో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. నారింజ, నిమ్మ, గ్రేప్ఫ్రూట్లో విటమిన్ సి, ఫోలేట్తో పాటుగా, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వాపును తగ్గిస్తాయి. ఫ్యాటీ చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీన్స్ తింటే హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. బీన్స్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే క్యాన్సర్ కణాలు తగ్గుతాయి. టోపు, ఎడమామే, సోయా పాలలో ఐసోఫ్లేవోన్లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ లెవెల్స్ను స్థిరంగా ఉంచుతాయి. సోయా ఫుడ్ తింటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి

ఉదయం ఖాళీ పొట్టతో మనం తినే ఆహారం ఆ రోజంతా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. చాలామందికి ఉదయం లేవగానే టీ, కాఫీ తాగనిదే రోజు మొదలవదు. కానీ పరగడుపున తాగితే కొందరిలో గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. కాఫీలోని కెఫీన్ పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచి, పేగుల్లో మంట పుట్టిస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే పరగడుపున కాఫీ, టీలు తాగకూడదు. ఉదయానే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ వంటి పండ్లను తినకూడదు. వీటిని పరగడుపున తింటే గుండెల్లో మంటను కలిగిస్తాయి. బజ్జీ, బోండా, వడ వంటి నూనె, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను ఉదయాన్నే పరగడుపున తినొద్దు. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఫ్యాటీ లేదా గ్రీసీ ఫుడ్స్ కొందరిలో డిస్పెప్సియా లక్షణాలను కలిగిస్తాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) పేర్కొంది. అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి పెరుగు లేదా యోగర్ట్ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి వాళ్లు పరగడుపున తినకుండా, మధ్యాహ్న భోజనంతో పాటు తీసుకోవడం మంచిది. పరగడుపున అరటిపండు తింటే పెద్దగా నష్టమేమీ లేదు. కానీ, కొందరికి ఉదయాన్నే పరగడుపున అరటిపండు తింటే కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలగవచ్చు. బాగా పండిన అరటిపండు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అరటిపండు పండేకొద్దీ దానిలోని పిండిపదార్థం చక్కెరగా మారుతుంది. కాబట్టి అరటిపండును తినకూడదు

షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఈ పచ్చి ముక్కను రోజుకొకటి తింటే చాలుఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీ Prasanna Yadla 01 september 2026 Pic credit - Pinterest ఉల్లిపాయను మన అన్ని కూరల్లో వేసుకుని తింటాము. ఎందుకంటే, ఇది తిన్న వెంటనే అరిగిపోతోంది ఉల్లిపాయ దీనిని తీసుకుంటే మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. శరీరానికి ఎన్నో లాభాలు దీనిని ఆహారంలో దీనిని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. పోషకాలు ఈ పచ్చి ఉల్లిపాయను మీరు రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు రక్తంలో చక్కెర స్థాయిలు ఈ ఉల్లిపాయలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి గ్లైసెమిక్ ఇండెక్స్ డయాబెటిస్ తో బాధ పడేవాళ్ళు ఈ పచ్చి ఉల్లిపాయను టిఫిన్ చేసేటప్పుడు కూడా తీసుకోవచ్చు. టిఫిన్ చేసేటప్పుడు అయితే, నిపుణుల చెప్పిన దాని ప్రకారం రోజుకు సుమారు 50 గ్రాములు తీసుకుంటే ఫలితం చూస్తారు సుమారు 50 గ్రాములు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి
కాఫీ తాగితే కాలేయంలో అసాధారణ ఎంజైమ్లు తగ్గుతాయి. క్రమం తప్పకుండా రోజూ ఒక కప్పు తాగడం వల్ల కాలేయంపై మచ్చలు, ఫైబ్రోసిస్ తగ్గుతుందని హెల్త్లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ వాపు, కొవ్వును తగ్గిస్తాయి. లివర్ను ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తింటే ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలేయం దగ్గర కొవ్వు ఏర్పడకుండా చూస్తాయి. వాల్నట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓట్మీల్ తింటే ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. అవకాడో తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో అల్లిసిన్ కూడా లభిస్తుంది. వెల్లుల్లి తింటే కాలేయ కొవ్వు కరుగుతుంది. బ్లూ బెర్రీస్, రాస్ప్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది
నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి హెల్తీగా బరువు పెరిగేందుకు సహాయపడతాయి. అందుకే బరువు పెరగాలని చూసేవారు వేడి అన్నం, పప్పుతో నెయ్యి కలిపి తింటే చాలా మంచిది. బర్రె పాలు లేదా ఆవు పాలు కొవ్వుతో పాటు తీసుకుంటే కావాల్సిన ప్రోటీన్, ఫ్యాట్స్, కేలరీలు అందుతాయి. తద్వారా బరువు పెరగవచ్చు. అయితే జీర్ణ సమస్యలు ఉంటే పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. ఖర్జూరాల్లో నేచురల్ షుగర్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పాలలో ఖర్జూరాలు కలిపి తీసుకోవడం లేదా నేరుగా తీసుకోవడం ద్వారా బరువు పెరగవచ్చు. ఎండుద్రాక్ష (కిస్మిస్)లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కిస్మిస్ తినడం ద్వారా సన్నగా ఉన్నవారు బరువు పెరగవచ్చు. బాదం, జీడిపప్పు లాంటి గింజల్లో హెల్తీ ఫ్యాట్స్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని స్నాక్స్గా తీసుకుంటే బరువు పెరగవచ్చు. వేయించిన శనగ పిండిని నీళ్లు లేదా పాలతో కలిపి కొద్దిగా బెల్లం కలిపి సత్తు చేసుకోవచ్చు. ఇది ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేసి బరువు పెంచడంలో సహాయపడుతుంది. అన్నం, పెసరపప్పుతో తయారుచేసే కిచిడిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. వేడి వేడి కిచిడిలో నెయ్యి వేసుకుంటే తింటే బరువు పెరిగేందుకు సహాయపడుతుంది. చిలగడదుంపలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడమే కాకుండా బరువు పెరిగేందుకు సహాయపడతాయి. పనీర్లో ప్రోటీన్, ఫ్యాట్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కండలు పెరిగేందుకు సహాయపడటమే కాకుండా బరువు పెరిగేలా చేస్తాయి

చిలగడదుంపలో కరిగే, కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. చిలగడదుంపలో అధికంగా ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ ఎ-గా మారుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చిలగడదుంపలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చిలగడదుంప గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. దీనివల్ల శక్తి నెమ్మదిగా విడుదల అవుతుంది. ఫలితంగా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. చిలగడదుంపలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలగడదుంపలోని బీటా-కెరోటిన్, విటమిన్లు సి, ఇ కంటి కణజాలాలను రక్షిస్తాయి. వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను ఇది నివారిస్తుంది. Blouse: పింక్ శారీకి మ్యాచ్ అయ్యే అదిరిపోయే బ్లౌజు డిజైన్లు Gold Earrings: నేటితరం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్! Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది! Bracelet Designs: చేతులకు ట్రెండీ లుక్ ఇచ్చే బ్రేస్లేట్ డిజైన్లు

ఒంటరితనం కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: గుండె ఆరోగ్యం అంటే కేవలం కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా రోజుకు ఎన్ని అడుగులు నడిచామన్నది మాత్రమే కాదు. మన మానసిక ఆరోగ్యం, ఇతరులతో మనకున్న సంబంధాలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఒంటరితనం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఒంటరితనం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒంటరితనం అంటే ఇంట్లో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. మనసుకు దగ్గరైన వారితో మాట్లాడే అవకాశం లేకపోవడం, ఇతరులతో అనుబంధం లేకపోవడం కూడా ఒంటరితనంలోకి వస్తాయి. ఎక్కువ కాలం ఇలా ఒంటరిగా ఉంటే ఒత్తిడి పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. పరిశోధనల్లోనూ దీర్ఘకాలిక ఒంటరితనం, సామాజికంగా ఇతరులకు దూరంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని తేలింది. గుండె ఆరోగ్యం కోసం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ఒంటరితనాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇతరులతో బంధాలు కొనసాగించాలి. దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒంటరితనం ఒక్కటే గుండె జబ్బులకు కారణమవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. గుండె జబ్బుల ముప్పుపై వయసు, వంశపారంపర్యం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం, ఆహారం, శారీరక శ్రమ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అయితే గుండె ఆరోగ్యం కేవలం ఆహారం, వ్యాయామంపైనే ఆధారపడదు. మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని నియంత్రించుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించడం కూడా మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమే. Note: ఇందులోని

ప్రతి రోజూ ఒక్క క్యారెట్ తింటే చాలు.. ఎన్ని లాభాలో..ప్రతి రోజూ ఒక్క క్యారెట్ తింటే చాలు.. ఎన్ని లాభాలో.. Samatha 21 August 2026 క్యారట్స్ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి రోజూ క్యారెట్ తినడం వలన శరీరానికి అనేక విధాలుగా మేల ు జరుగుతుంది. ప్రతి రోజూ ఒక క్యారట్ తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం., ప్రతి రోజూ క్యారట్ తినడం వలన కళ్లు షార్ప్గా కనిపిస్తాయి. ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉండటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. అంతే కాకుండా చర్మ నిగారింపుకు కూడా ఇది చాలా బెస్ట్. ప్రతి రోజూ క్యారెట్ తినడం వలన చర్మం నిగారింపుగా తయారు అవుతుంది. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యారెట్ తినడం వలన మలబద్ధకం రాద ు. అలాగే క్యారెట్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది తిన్న తర్వాత వెంటనే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి, బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది చాలా మంచిది అని చెప్పాలి. దీని వలన చాలా వేగంగా బరువు తగ్గవచ్చున ు క్యారెట్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన క్యారెట్ తినడం వలన జలుబు, దగ్గు అంత త ్వరగా రావు. మరిన్ని వెబ్ స్టోరీస్ కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా? వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే! పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?
అరటి పండ్లలో విటమిన్ బి6, బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉటాయి. ఇవి టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచుతాయి. వీర్య కణాల సంఖ్యను రెట్టింపు చేస్తాయి. అందుకు పురుషులు అరటి పండు తినడం చాలా మంచిది. దానిమ్మలో పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచి జననాంగాలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. దీంతో వీర్య కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఉసిరికాయల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి డీఎన్ఏ కణాలను కాపాడుతుంది. తద్వారా వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతంది. స్పెర్మ్ ఆరోగ్యంగా ఉంటుంది. జామకాయల్లో విటమిన్ సి, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్, నాణ్యత పెంచడంలో సహాయపడతాయి. తద్వారా సంతానోత్పత్తి మెరుగుపర్చుకోవచ్చు. నారింజ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి వీర్య కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. తద్వారా సంతానోత్పత్తి మెరుగుపరుస్తుంది. సపోటాలో డైటరీ ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వీర్య కణాల సంఖ్య, నాణ్యతను మెరుగుపరుస్తాయి. సీతాఫలంలో విటమిన్ బి6, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపర్చి వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి. బొప్పాయిలో బీటా కెరోటీ్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి వీర్య కణాల సంఖ్య పెంచి సంతానోత్పత్తి సమస్యలు రాకుండా చూస్తాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచి వీర్య కణాల సంఖ్య పెంచడంలో దోహదపడతాయి

వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే జరిగేది ఇదే వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే జరిగేది ఇదే Prasanna Yadla 16 August 2026 Pic credit - Pinterest ఐస్క్రీమ్ ను పాల నుంచి తయారు చేస్తారు. ఇంకా దీనిలో ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటుంది ఐస్క్రీమ్ ఐస్క్రీమ్లో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటుంది. ఇంకా వీటిని మితంగా తినడం అవసరం చక్కెర, కొవ్వు అయితే, మీరు దీనిని చలి కాలం, వానా కాలంలో ఎక్కువగా తినకూడదు. ఇతర సమస్యలు వస్తాయి చలి కాలం, వానా కాలంలో ఇంకా ఈ ఐస్క్రీమ్లోని కార్బోహైడ్రేట్లు మీ శరీరానికి కొద్దీ నిముషాల్లోనే శక్తిని ఇస్తాయి కార్బోహైడ్రేట్లు ఈ ఐస్క్రీమ్లో పండ్ల ఫ్లేవర్ కూడా కలుస్తుంది. వీటిలో కొన్ని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వర్షంలో ఈ ఐస్ క్రీం తింటే గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు గొంతు ఇన్ఫెక్షన్లు ఇంకా గాలిలో తేమ అధికంగా ఉండటం వలన జీర్ణశక్తి బలహీనపడుతుంది ఇది కడుపులో అసౌకర్యంగా ఉంటుందిఅయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు దీనిని పరిమితంగా తింటే సమస్య ఉండదు జీర్ణశక్తి బలహీనపడుతుంది (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి
ఫిట్నెస్ ప్రపంచంలో కండరాలు పెరగాలంటే 'అమైనో యాసిడ్ సప్లిమెంట్లు' తప్పనిసరి అనే ఒక పెద్ద అపోహ ఉంది. సాధారణంగా రోజూ సరిపడా ప్రొటీన్ (మాంసకృత్తులు) తీసుకునే ఆరోగ్యవంతులకు ఈ సప్లిమెంట్ల వల్ల పెద్దగా అదనపు ప్రయోజనం ఉండదు. కండరాల పెరుగుదల ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా చేసే రెసిస్టెన్స్ ట్రైనింగ్ (వెయిట్ లిఫ్టింగ్/వ్యాయామం), శరీరానికి అవసరమైన మొత్తం ప్రొటీన్ సరిగ్గా అందడం, కండరాలు కోలుకోవడానికి తగినంత విశ్రాంతి, నిద్ర అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మూడు సరిగ్గా లేకపోతే ఎలాంటి సప్లిమెంట్లు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు. అమైనో యాసిడ్ సప్లిమెంట్స్ vs సహజ ఆహారం.. కండరాల దృఢత్వానికి ఏది మేలు? దీనిపై పూర్తి సమాచారాన్ని మిస్ వీణ వి (చీఫ్ క్లినికల్ డైటీషియన్ & హెచ్ఓడి, ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం.అమైనో ఆమ్లాలు అంటే ఏంటి? ప్రొటీన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే నిర్మాణ భాగాలే అమైనో ఆమ్లాలు. శరీరానికి 20 రకాల అమైనో ఆమ్లాలు అవసరం కాగా, అందులో 9 'ఎసెన్షియల్ అమైనో ఆమ్లాల్ని' శరీరం సొంతంగా తయారుచేసుకోలేదు. వీటిని మనం రోజూ తినే ఆహారం ద్వారానే పొందాలి. శరీరానికి అవసరమైన మొత్తం 20 అమైనో ఆమ్లాలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు (9): వీటిని శరీరం సొంతంగా తయారుచేసుకోలేదు. ఆహారం ద్వారా మాత్రమే పొందాలి (ల్యూసిన్, ఐసోల్యూసిన్, వాలైన్ వంటివి). నాన్-ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు (11): వీటిని శరీరం అవసరమైనప్పుడు స్వయంగా ఉత్పత్తి చేసుకోగలదు. కండిషనల్ అమైనో ఆమ్లాలు (Conditional Amino Acids): సాధారణ సమయంలో శరీరం తయారుచేసినప్పటికీ, తీవ్రమైన అనారోగ్యం, గాయాలు లేదా అధిక శారీరక ఒత్తిడి ఉన్నప్పుడు ఆహారం ద్వారా అదనంగా అందించాల్సి ఉంటుంది.సహజ ఆహారమే ఎందుకు శ్రేష్టం? గుడ్లు, పాలు-పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు, చేపలు, చికెన్, సోయా, పప్పులు, బీన్స్, డ్రై ఫ్రూట్స్

వర్షాకాలం... వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారుతుంది. చుట్టూ పరిసరాలు ఆకుపచ్చగా మారిపోతాయి. ఆకుపచ్చని కూరగాయలు మార్కెట్ను ముంచెత్తుతాయి. అలా వానాకాలంలో ఆరోగ్య అతిథిగా పలకరించేది బొంత కాకరకాయ. ఈ కూరగాయ రుచిలో మేటి. ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అరచేతిలో ఇమిడిపోయే బొంతలో అణువణువూ సుగుణాలు ఎన్నో. అలా వానలు మొదలవ్వగానే... వంటింట్లోంచి వచ్చే ఘుమఘుమల్లో ఇట్టే తేడా కనిపిస్తుంది. అల్లం, వెల్లుల్లి, పుదీనా తదితరాల వాడకం ఎక్కువవుతుంది. మార్కెట్లో గుమ్మడికాయ, కాకరకాయ, బెండకాయ, పొట్లకాయ లాంటి కూరగాయల హవా మొదలవుతుంది. అయితే ఏడాది పొడవునా దొరికే వీటిని పట్టించుకోకుండా... వానాకాలపు ఆరోగ్య అతిథి కోసం తెగ వెదుకుతుంటారు గృహిణులు. అదే బొంత కాకరకాయ.... కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయ, అడవి కాకరకాయ అంటారు. కేవలం మాన్సూన్ సీజన్లోనే కనిపించే బొంత కాకరకాయ ఎంతో అపురూపమైన కూరగాయ. ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాలతో ఈ సీజన్లో వీటిని తప్పక తింటుంటారు. ఒక్కో చోట ఒక్కో పేరు... భారతదేశం ఎంతో వైవిధ్యమైన దేశమని చెప్పడానికి బొంత కాకరకాయను చూపొచ్చు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో దీనిని పిలుస్తుంటారు. తెలుగువాళ్లు అడవి కాకరకాయ, బోడ కాకరకాయ, బొంత కాకరకాయ అంటారు. అదే హిందీలో - కాకోడా, మరాఠీలో - కంటోలి, గుజరాతీలో - కంటోలా, తమిళంలో- మూకు పావక్కాయ్, మలయాళంలో - కొట్టుపావక్కా, కన్నడలో - మాడహాగలకాయి... ఇలా వీటికి ఎన్నో పేర్లు. దీని తోలుపై మెత్తని ముళ్లు ఉండడం వల్ల ఇంగ్లీష్లో ‘స్పైనీ గార్డ్’ అంటారు. దేశమంతా ఈ కూరగాయ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ... మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రజలు అమితంగా బొంత కాకరకాయ రుచుల్ని ఆస్వాదిస్తారు. మల్టీ విటమిన్లకు చిరునామా... పేరును బట్టి బొంత కాకరకాయ, మామూలు కాకరకాయలాగానే చేదుగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి రెండూ ఒకే కుటుంబానికి చెందినా కూడా కాకరకాయంత చేదు ఇందులో

మజ్జిగలో ఉప్పు ఎక్కువగా కలుపుతున్నారా.. ముందు ఇది తెలుసుకోండి మజ్జిగలో ఉప్పు ఎక్కువగా కలుపుతున్నారా.. ముందు ఇది తెలుసుకోండి Prasanna Yadla 15 August 2026 Pic credit - Pinterest కొందరు మజ్జిగ తాగేటప్పుడు నార్మల్ గా తాగరు. మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగుతారు. మజ్జిగలో ఉప్పు ఇంకా అధిక సోడియం తీసుకోవడం వలన కొందరిలో రక్తపోటు అమాంతం పెరగొచ్చు. రక్తపోటు ఉప్పు ఎక్కువగా ఉన్న మజ్జిగను పదే పదే తాగడం కూడా అంత మంచిది కాదు మజ్జిగ ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు చేరుతుంది. ఇంకా కొందరికి ఉబ్బరంగా కూడా ఉంటుంది . కొందరికి ఉబ్బరంగా ఈ కిడ్నీలు మీ శరీరంలోని సోడియంను కూడా ఇది నియంత్రిస్తుంది. ఇంకా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కేర్ గా ఉండాలి కిడ్నీ సమస్యలు ఉప్పు తగ్గించి మజ్జిగను తీసుకుంటే ఏం కాదు, మరి ఎక్కువైతేనే సమస్య మరి ఎక్కువైతేనే సమస్య అధిక రక్తపోటు ఉన్నవారు కూడా దీనిని మితంగానే తీసుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది అధిక రక్తపోటు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏం తింటున్నామనే విషయం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిజానికి ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగడం వల్ల అది రక్తంలోకి వేగంగా శోషించబడుతుంది. అందుకే తినకుండా తాగడం కంటే సరైన ఆహారం తీసుకోవడం మంచిది. అయితే ప్రతి ఆహారం ఆల్కహాల్తో కలిపి తినడానికి అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా కొన్ని పదార్థాలను ఆల్కహాల్ తో కలిపి అస్సలు తినకూడదు. అవేంటో చూద్దాం. ఆల్కహాల్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, చికెన్ ఫ్రై, ఇతర డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తినడం చాలామందికి అలవాటే. కానీ ఇలాంటి కొవ్వు అధికంగా ఉండే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మరోవైపు ఆల్కహాల్ కూడా జీర్ణాశయాన్ని ప్రభావితం చేస్తుంది. దానివల్ల కడుపు ఉబ్బరం, భారంగా అనిపించడం, అజీర్ణం లేదా గుండెల్లో మంట, లివర్ పై ఒత్తిడి వంటి సమస్యలు పెరగవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అసిడిటీ సమస్యలు ఉన్నవారు ఇలాంటి కాంబినేషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్తో పాటు ఎక్కువ కారం, మసాలాలు ఉన్న బిర్యానీ, స్పైసీ చికెన్, మిర్చి బజ్జీలు, ఎక్కువ మసాలా ఉన్న స్నాక్స్ తీసుకోవడం కొందరిలో కడుపులో మంటను పెంచవచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ కారణంగా జీర్ణాశయం అప్పటికే ఇర్రిటేట్ అయ్యే పరిస్థితిలో ఉంటుంది. దానికి కారం ఎక్కువగా ఉన్న ఆహారం జోడిస్తే అసౌకర్యం మరింత పెరగవచ్చు. ఛాతీలో మంట, పుల్లని తేన్పులు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉన్నవారు ఇలాంటి ఆహారాలను తగ్గించడం మంచిది. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు చిప్స్, ఉప్పు పల్లీలు, ప్యాకేజ్డ్ స్నాక్స్, ప్రాసెస్డ్ మీట్ వంటి ఉప్పు అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తినడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల దాహం పెరగవచ్చు. దానివల్ల ఎక్కువ ఆల్కహాల్ తాగాలి అనిపించవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉప్పు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాలిక్ డ్రింక్స్లోనే కొంతమేర చక్కెర
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మ కణాలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం యవ్వనంగా ఉంటుంది. అందుకే అద్భుతమైన చర్మ సౌందర్యం కోసం ఉసిరి జ్యూస్ తాగడం చాలా మంచిది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని మెరిపిస్తాయి. అందుకే రోజూ పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం చాలా మంచిది శరీర వేడిని తగ్గించడంతో పాటు చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ధనియాల నీళ్లు సహాయపడతాయి. దీనికోసం రాత్రంతా నానబెట్టిన ధనియాల నీళ్లను ఉదయం వడబోసి తాగితే సరిపోతుంది. జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా అందాన్ని పెంచడంలో సోంఫు టీ సహాయపడుతుంది. దీనికోసం నీళ్లలో సోంఫు వేసి మరిగించి తాగితే సరిపోతుంది. చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపర్చి విష పదార్థాలను బయటకు పంపడంలో ఈ టీ సహాయపడుతుంది. దీనికోసం నీళ్లలో అల్లం ముక్కలు, తులసి ఆకులు మరిగించి తాగితే సరిపోతుంది. తాజా అలోవెరా నుంచి రసం తీసి అందులో కొద్దిగా పుదీనా, తులసి ఆకులు కలిపి తాగితే చర్మం పూర్తిగా డీటాక్స్ అవుతుంది. తద్వారా అందంగా కనపడొచ్చు. పేగులను పూర్తిగా క్లీన్ చేసి శరీరాన్ని డీటాక్స్ చేయడంలో నిమ్మరసం సహాయపడుతుంది. అందుకో ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే అందం రెట్టింపు అవుతుంది. కీరదోస నుంచి రసం తీసి అందులో కొద్దిగా నిమ్మరసం, వేయించిన జీలకర్ర పొడి కలిపి తాగితే చర్మానికి చాలా మంచిది. ఇది స్కిన్ గ్లో పెంచడంలో సహాయపడుతుంది. కుంకుమపువ్వు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మం యవ్వనంగా ఉండాలని కోరుకునే వారు ప్రతిరోజూ ఓ గ్లాసు కుంకుమపువ్వు పాలు తాగితే మంచిది
ప్రూనేలో ఫైబర్తో పాటుగా, సార్బిటాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. ప్రూనే రసం తాగితే మలబద్దకం తగ్గుతుందని హెల్త్లైన్ తెలిపింది. కివీలో యాక్టినిడిన్ అనే ఎంజైమ్తో పాటుగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కివీ తింటే ప్రోటీన్ ఈజీగా జీర్ణం అవుతుంది. దీంతో మలవిసర్జన సాఫీగా అవుతుంది. యాపిల్స్లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలాన్ని మృదువుగా మార్చుతుంది. దీంతో మలవిసర్జన సాఫీగా అవుతుంది. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి పేగు కదలికలను మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు తింటే మలవిసర్జన సాఫీగా అవుతుంది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారంలో ప్రోటీన్లను విచ్చిన్నం చేస్తుంది. బొప్పాయితో మలవిసర్జన సాఫీగా అవుతుంది. చియా గింజలు తినడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చియా గింజలు తింటే మలం మృదువుగా మారుతుంది. దీంతో మలవిసర్జన సాఫీగా అవుతుంది. ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అవిసె గింజల్లో కరిగే, కరగని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవిసె గింజలు తింటే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలవిసర్జన సాఫీగా అవుతుంది. బీన్స్లో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫైబర్తో నిండి ఉంటుంది. బీన్స్ తింటే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది
బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. బాదం గింజలు తింటే నిద్రబాగా పడుతుందని హెల్త్లైన్ తెలిపింది. చామంతి టీలో అపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. చామంతి టీ తాగితే గాఢ నిద్ర పడుతుంది. కివీ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్ర త్వరగా పట్టేందుకు సాయపడతాయి. నిద్రపోవడానికి గంట ముందు కివీ తింటే మంచిది. సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ డి కూడా లభిస్తుంది. సాల్మన్ తింటే నిద్ర నాణ్యత పెరుగుతుంది. వాల్నట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మైండ్ని రిలాక్స్గా ఉంచుతాయి. వాల్నట్స్ తింటే నిద్రబాగా పడుతుంది. అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్ర నాణ్యతను పెంచుతాయి. చిలగడదుంపల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నిద్ర నాణ్యతను పెంచుతాయి. గోరు వెచ్చని పాలు తాగితే నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. ఇందులోని ట్రిఫ్టోఫాన్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో నిద్ర పడుతుంది. నిద్రపోవడానికి ముందు కాఫీ, టీలు తాగొద్దు. ఇవి నాడీ వ్యవస్థను యాక్టివ్ చేసి నిద్రను దూరం చేస్తాయి

Weight Loss Foods:ఉదయాన్నే కొన్ని ఆహార పదార్థాలను సరైన కాంబినేషన్లో తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు, ఆకలి నియంత్రణకు సహాయపడవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారాలను కలిపి తీసుకోవడం బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఉదయాన్నే కలిపి తినాల్సిన ఆ రెండు ఫుడ్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకోండి. ఉదయం నానబెట్టిన బాదం, నల్ల ఎండుద్రాక్షను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి పలు ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటంతో ఈ కలయికను ఆరోగ్యకరమైన ఉదయపు ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా రోజును పోషకమైన ఆహారంతో ప్రారంభించాలనుకునేవారికి ఇది సులభమైన ఎంపిక. బాదంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, ఎముకల బలం, జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి. బాదంలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడవచ్చు. దీంతో మధ్యలో అనవసరమైన స్నాక్స్ తీసుకోవాలనే కోరిక తగ్గే అవకాశం ఉంటుంది. బాదాన్ని నానబెట్టి తినడం కొందరికి జీర్ణం కావడానికి సులభంగా అనిపించవచ్చు. అయితే నానబెట్టడం వల్ల బాదంలోని అన్ని పోషకాలు తప్పనిసరిగా ఎక్కువగా శరీరానికి అందుతాయనే విషయం మాత్రం స్పష్టంగా నిరూపించబడలేదు. నల్ల ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరుకు తోడ్పడుతుంది. తగినంత నీరు తీసుకుంటూ ఎండుద్రాక్షను ఆహారంలో చేర్చుకోవడం మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడవచ్చు.అయితే ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా బరువు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన వారు పరిమాణంపై శ్రద్ధ పెట్టడం మంచిది. నానబెట్టిన బాదం, నల్ల ఎండుద్రాక్షను కలిపి తీసుకోవడం ద్వారా ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు వంటి వివిధ పోషకాలు ఒకేసారి లభిస్తాయి. ఇది ఉదయం

మనం ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తింటాడు. ఒక్క పూట భోజనం ఆలస్యమైతేనే నీరసంగా అనిపిస్తుంది. కొందరు వ్యక్తులు ఉపవాసాలు ఉంటారు. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారం లభించని పరిస్థితులు వస్తే ఎన్ని రోజులు ఒక వ్యక్తి బతకగలడు? ఆ సమయంలో మానవ శరీరంలోని అవయవాలు శక్తిని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయి? ఈ ప్రశ్నలకు వైద్యులు ఆసక్తికరమైన శాస్త్రీయ సమాధానాలను వెల్లడించారు. మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఆహారం అందనప్పుడు అది ప్రత్యేక ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్లి శరీరానికి శక్తి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆహారం అందడం ఆగిపోయిన మొదటి కొన్ని గంటల నుంచి కొద్ది రోజుల వరకు శరీరం శక్తిని పొందే ప్రక్రియ మొదలవుతుంది. సాధారణ రోజుల్లో మనం తినే ఆహారం ద్వారా లభించే 'గ్లూకోజ్' మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఆహారం తీసుకోవడం ఆపేసిన మొదటి 12 నుంచి 24 గంటల్లో, కాలేయం, కండరాలలో ముందుగానే దాచిపెట్టిన 'గ్లైకోజెన్' నిల్వలను శరీరం విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఈ గ్లైకోజెన్ను గ్లూకోజ్గా మార్చి మెదడుకు, ఇతర అవయవాలకు శక్తిని సరఫరా చేస్తుంది. కానీ, ఈ గ్లైకోజెన్ నిల్వలు కేవలం ఒక రోజు లేదా రెండు రోజులకు మాత్రమే సరిపోతాయి. రెండవ రోజు దాటిన తర్వాత శరీరంలో గ్లైకోజెన్ నిల్వలు ఖాళీ అయిపోతాయి. తరువాత శరీరం తన కణజాలాల్లోని కొవ్వు నిల్వలపై ఆధారపడుతుంది. ఈ దశను వైద్య పరిభాషలో 'కీటోసిస్' అంటారు. కాలేయం ఈ కొవ్వులను కరిగించి 'కీటోన్లు'గా మారుస్తుంది. ఈ కీటోన్లు రక్తం ద్వారా ప్రయాణించి మెదడుకు, గుండెకు గ్లూకోజ్కు ప్రత్యామ్నాయంగా శక్తిని అందిస్తాయి. శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలను బట్టి ఒక మనిషి ఆహారం లేకుండా వారాల పాటూ జీవించగలడు. అయితే ఆహారం లేకుండా కొద్ది రోజులు బతగవచ్చు కానీ...'నీరు' లేకుండా మాత్రం 3 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం
బీట్రూట్లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్గా మారి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుందని హెల్త్లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ప్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల గోడలను బలంగా ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను విస్తరింపచేస్తాయి. దానిమ్మ తింటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనంతో పాటుగా నైట్రేట్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది. వాల్నట్స్లో ఆల్పా లినోలెనిక్ యాసిడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో రక్తప్రసరణ బాగా జరుగుతుంది

Zinc Deficiency: చాలా మందిలో జింక్ (Zinc) లోపం కారణంగా జుట్టు విపరీతంగా రాలుతోంది. అయితే, ఈ సమస్య ఉన్నవారిలో కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. వీటిని గుర్తు పెట్టుకుని.. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. Zinc Deficiency: ప్రస్తుత చాలా మందిలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలడం (Hair Loss).. మానసిక ఒత్తిడితో పాటు ఆధునిక జీవనశైలి, కాలుష్యం, హార్మోన్ల సమస్యల కారణంగా ఈ సమస్య చాలా మంది వస్తోంది. అయితే, పోషకాలు లేని జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా చాలా మంది ఈ జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఖరీదైన హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడినా జుట్టు రాలడం తగ్గడం లేదా? అయితే, మీ శరీరంలో ఒక ముఖ్యమైన పోషకం లోపించిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.. జింక్ (Zinc) లోపం కారణంగా కూడా ఇలా తరచుగా జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ లోపం నుంచి విముక్తి పొందడానికి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. జింక్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, దెబ్బతిన్న జుట్టు కణాల రిపేర్ చేసేందుకు కూడా జింక్ ఎంతగానో కృషి చేస్తుంది.. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి, దృఢత్వానికి అవసరమైన కెరాటిన్ (Keratin) అనే ప్రోటీన్ ఉత్పత్తికి జింకే సహాయపడుతుంది. మన శరీరం ఎల్లప్పుడు, సొంతంగా జింక్ను ఉత్పత్తి చేసుకోలేదు.. కాబట్టి మనం తీసుకునే ఆహారం వల్లే దీనిని పొందవచ్చు.. ఈ లోపం ఏర్పడినప్పుడు జుట్టు కుదుళ్లు బలహీనపడి.. జుట్టు వేగంగా రాలిపోవడం మొదలవుతుంది. కాబట్టి ఇలా మీకు కూడా జరిగితే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.. శరీరంలో జింక్ తగ్గితే కేవలం జుట్టు రాలడం మాత్రమే
నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల నుంచి వ్యర్థాలు, అదనపు ఉప్పు బయటకు తొలగుతుంది. దీంతో కిడ్నీలు డీటాక్స్ అవుతాయి. కిడ్నీలు హెల్తీగా మారుతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. తాజా ఆహారం తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా మారుతాయి. కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీని వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా మారుతాయి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ను తాగడం వల్ల రక్తంలో నికోటిన్ స్థాయిలు పెరుగుతాయి. కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆల్కాహాల్ ఎక్కువగా తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీంతో కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆల్కాహాల్కు దూరంగా ఉండండి. వైద్యుడి సూచనలు లేకుండా పెయిన్ కిల్లర్స్ ఉపయోగించడం వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి రోజూ 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీని వల్ల కణాలు రిపేర్ అవుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి

పెద్దలు పంచభక్ష్య పరమాన్నాలు భోజనాలు పెట్టాలని అంటారు. అసలు పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? పంచభక్ష్యాలు అంటే ఐదు రకాల ఆహార పదార్థాలు. మనం తినే ఆహారాన్ని అది ఎలా తింటున్నాం అనే పద్ధతి ఆధారంగా ఐదు రకాలుగా పూర్వకాలంలో విభజించారు. అవి భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం. ఈ ఐదు రకాల ఆహారాలను కలిపి పంచభక్ష్యాలు అని పిలుస్తారు. ఈ పదానికి తెలుగు సాహిత్యంలో కూడా ఆధారం ఉంది. పోతన భాగవతంలో భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయ రకాల ఆహారాల ప్రస్తావన కనిపిస్తుంది. ఇక పరమాన్నం అంటే సాధారణంగా పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో చేసే తీపి వంటకం. పంచభక్ష్యాలలో ఎలాంటి ఆహారాలను పెట్టాలో తెలుసుకోండి. పంచభక్ష్య పరమాన్నాలలో మొదటిది భక్ష్యం. చేత్తో పట్టుకుని కొరికి తినే పదార్థాలను ఈ రకంలోకి తీసుకుంటారు. ఉదాహరణకు గారెలు, బూరెలు, కుడుములు, లడ్డూలు, వడలు వంటి వంటకాలను చెప్పుకోవచ్చు. రెండోది భోజ్యం. బాగా నమిలి తినే ప్రధాన ఆహారాన్ని భోజ్యం అంటారు. అన్నం, పులిహోర, చిత్రాన్నం, దద్దోజనం వంటి వంటకాలు దీనికి ఉదాహరణలు. మూడోది లేహ్యం. నాలుక మీద పెట్టి రుచి చూస్తూ తినే పదార్థాలను లేహ్యం అంటారు. తేనె, కొన్ని రకాల పచ్చళ్లు, తీపి పదార్థాలను దీనికి ఉదాహరణలుగా చెబుతారు. నాలుగోది చోష్యం. నోటితో జుర్రుకుంటూ తీసుకునే ఆహారాన్ని చోష్యం అంటారు. చారు, రసం, పాయసం వంటి ద్రవంగా ఉండే వంటకాలను ఈ రకంలో చెబుతారు. ఐదోది పానీయం. నేరుగా తాగే పదార్థాలు ఈ రకంలోకి వస్తాయి. మంచినీరు, పానకం, పాలు, పండ్ల రసాలు వంటివి పానీయాలకు ఉదాహరణలు. మన పూర్వీకులు భోజనాన్ని కేవలం అన్నం, కూర, పప్పుగా మాత్రమే చూడలేదు. కొరికి తినేది భక్ష్యం, నమిలి తినేది భోజ్యం, నాకేది లేహ్యం, జుర్రుకునేది చోష్యం, తాగేది పానీయం. ఇలా ఐదు రకాలుగా ఆహారాన్ని చెప్పే పద్ధతే
వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను ఈజీగా కరిగిస్తాయి. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఈజీగా కరిగిపోతుంది. దీనికోసం ప్రతిరోజూ ఉదయం పసుపు టీ తాగితే సరిపోతుంది. మెంతుల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది పేగులు, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు రక్షణ కల్పిస్తాయి. గ్రీన్ టీలోని కెటాచిన్స్ శక్తివంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తాయి. అలాగే గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు మేలు చేయడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్లో మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెను రక్షిస్తాయి. యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే ఫైబ్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను శోషించుకుని రక్తంలో లిపిడ్ లెవెల్స్ తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాదం, వాల్నట్స్, గుమ్మడి, అవిసె లాంటి గింజల్లో స్టిరాల్స్, మెగ్నీషియం, పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్త నాళాలను శుభ్రంగా మారుస్తాయి

చాలామంది జీవితంలో ఎదుర్కొనే సాధారణ సమస్యలలో నిద్రలేమి ఒకటి. తినకముందు ఏ పనినైనా చేసే ఉత్సాహం, డిన్నర్ తర్వాత హఠాత్తుగా నిద్ర ముంచుకొచ్చే అనుభవం మనందరికీ తెలిసిందే.. ఆహారానికి నిద్రను కలిగించే తత్వం ఉంటుందని, సరైన ఆహారాలను ఎంచుకోవడం ద్వారా సుఖమైన, గాఢమైన నిద్ర పొందవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. రాత్రిపూట డిన్నర్లో లేదా డిన్నర్ తర్వాత తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన ఆహారాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.. కఫ సంబంధిత సమస్యలు లేని వారికి ఈ ఆహారాలు అద్భుతమైన నిద్రకు సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండు: నిద్రకు సహాయపడే ఆహారాలలో అరటిపండు ముఖ్యమైనది. అరటిపండులో పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నొప్పులు (మజిల్ క్రాంప్స్) తగ్గించడానికి తోడ్పడతాయి. అంతేకాకుండా, ఇది కడుపు నిండుగా ఉండి ఆకలి అనే భావన లేకుండా చేస్తుంది. దీని వల్ల హాయిగా, కమ్మగా నిద్రపడుతుంది. డిన్నర్ చేసిన తర్వాత ఒకటి లేదా రెండు గంటలు ఆగి అరటిపండు తింటే సుఖమైన నిద్ర మీ సొంతమవుతుందని పేర్కొంటున్నారు. చెర్రీస్: మంచి నిద్ర కోసం చాలామందికి తెలియని, కానీ అత్యంత ప్రభావవంతమైన ఆహారం చెర్రీస్. చెర్రీస్లో మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపించే ప్రత్యేకమైన తత్వం ఉంటుంది. మెలటోనిన్ అనేది సహజమైన స్లీప్ హార్మోన్, ఇది నిద్రను ప్రేరేపించడానికి, నియంత్రించడానికి సహాయపడుతుంది. చెర్రీస్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.. ఇది గాఢమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. పెరుగు: అనాదిగా మనం ఉపయోగిస్తున్న, గాఢమైన నిద్రకు తోడ్పడే మరో ఆహారం పెరుగు. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పెరుగు “స్తోతస్సుల” పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను అందించే “మనోవహ స్తోతస్సుల”ను అడ్డగించడం ద్వారా చక్కటి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. కాల్షియం కండరాల నొప్పులు రాకుండా చేస్తుంది. ఇది ప్రశాంతమైన నిద్రకు చాలా అవసరం. మంచి గడ్డపెరుగు రాత్రిపూట

తినదగినవాటిలో శక్తివంతమైన వాటిని తినాలనే ధ్యాస, వండాలనే తపన ఉండాలే గానీ, కూరగా వండుకోవటానికి పనికిరాని దేదీ లేదు... ఆఖరికి వేప చిగురు కూడా! చిగురాకుల్లో వేపచిగురు శక్తివంతమైంది. అమృతానికి వేపచిగురు మారుపేరు. ప్రకృతి సంపదలో ఆహార యోగ్యమైన ఔషధాలను వంటగదిలోకి తెచ్చిన పాకశాస్త్ర కోవిదుడు నలుడు. మేడికాయలతోనూ కలబందతోనూ, వేపచిగుళ్లతోనూ ఆఖరికి జిల్లేడాకులతో కూడా ఆయన ఆరోగ్యదాయక వంటకాలను చేసి చూపించాడు. వేప సర్వరోగనివారిణి అని ఇవ్వాళ కొత్తగా చెప్పాల్సింది లేదు. లేత వేపచిగుళ్లలో చేదు తక్కువగా ఉండటమే కాకుండా తేలికగా అరిగేదిగా ఉంటుంది. చలవ నిస్తుంది. జఠరాగ్ని పెంచుతుంది. తద్వారా షుగర్స్, కొవ్వు పదార్థాలు తేలికగా వంటబట్టి శరీరానికి శక్తిగా మారతాయి. దప్పిక తీరుస్తాయి. దగ్గు, కఫాలను ఆపుతాయి. జ్వరాన్ని నివారిస్తాయి. నోటికి అన్నహితవుని కలిగిస్తాయి. సూక్ష్మజీవుల దోషాలను పోగొడతాయి. అల్సర్లు త్వరగా మాడేలా చేస్తాయి. వాంతి వికారాలను తగ్గిస్తాయి. అతిసార వ్యాధి ఏర్పడినప్పుడు విరేచనం నీటి శాతాన్ని తగ్గించి శోషరాకుండా కాపాడతాయి. చర్మరోగాలను, ఎలర్జీవ్యాధులను పోగొడతాయి. షుగరు వ్యాధికి శత్రువుగా పనిచేస్తాయి. ఇంతకన్నా ఏం కావాలి...? ‘‘త్రిదోషశమనం పథ్యం సర్వవ్యాధిహరం శుభమ్’’ ఒక గొప్ప ఔషధాన్ని ఆహారంగా తీసుకుంటే అన్ని దోషాలనూ వ్యాధులనూ తగ్గించటమే కాదు, అవి రాకుండా కూడా కాపాడుతుందంటాడు నలుడు. ‘శుభం’ అనటం ద్వారా వేపచిగుళ్లను తినటం అనేది మంగళకరమైన శుభప్రదమైన అంశంగా పేర్కొన్నాడు. సర్వ పాపహరం అనటం లాంటిది. వేపచిగుళ్ల కూర: లేత వేపచిగుళ్లలోని ఈనెలు, కాడలు తొలగించి సన్నగా తరిగి ఉప్పు, పసుపు కలిపిన నీటిలో వేయాలి. వాటితో పాటు కొద్దిగాగలిజేరు (పునర్నవ- అటికమావిడి) ఆకులు, లేదా కామంచికాయలు, లేదా పత్తి ఆకులు కలిపి అరగంట నానబెట్టి, తరువాత శుభ్రమైన నీటితో కడగాలి. ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేడి చేసి తాలింపు ద్రవ్యాలు వేసి, ఈ ఆకులన్నింటినీ మెల్లగా మగ్గించాలి. తరువాత ఇష్టమైన సంబారాలను నూరి కలిపి కొద్దిసేపు ఉమ్మగిల్లనివ్వాలి

ఇవి తెలిస్తే రోజుకొక మిర్చి అన్నంలోనే తినేస్తారు ఇవి తెలిస్తే రోజుకొక మిర్చి అన్నంలోనే తినేస్తారు Prasanna Yadla 08 August 2026 Pic credit - Pinterest వర్షంలో గోధుమ పిండి పకోడీలను ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని లాగిస్తారు. ఎలా చేయాలో ఇక్కడ చదివి చూద్దాం.. గోధుమ పిండి పకోడీ పచ్చిమిర్చిలో ఎక్కువగా విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. పచ్చిమిర్చి ఈ మిర్చి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకే అన్ని కూరల్లో దీనిని వేస్తారు అన్ని కూరల్లో దీనిని వేస్తారు ఇంకా ఈ మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ శరీరంలోని వేడిని పెంచడంలో ఇది హెల్ప్ చేస్తుంది శరీరంలోని వేడిని మీరు వీటిని సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది జీర్ణక్రియ పనితీరు ఈ పచ్చిమిర్చి చాలా తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి దీనిని మీ రోజువారీ వంటల్లో కూడా తీసుకోవచ్చు పచ్చిమిర్చి ఇంకా దీనిలో ఉండే విటమిన్ C శరీర రోగనిరోధక వ్యవస్థకు ఎంతగానో ఇది హెల్ప్ చేస్తుంది శరీర రోగనిరోధక వ్యవస్థ (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి