
బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. బాదం గింజలు తింటే నిద్రబాగా పడుతుందని హెల్త్‌లైన్ తెలిపింది.
చామంతి టీలో అపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. చామంతి టీ తాగితే గాఢ నిద్ర పడుతుంది.
కివీ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్ర త్వరగా పట్టేందుకు సాయపడతాయి. నిద్రపోవడానికి గంట ముందు కివీ తింటే మంచిది.
సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ డి కూడా లభిస్తుంది. సాల్మన్ తింటే నిద్ర నాణ్యత పెరుగుతుంది.
వాల్నట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మైండ్‌ని రిలాక్స్‌గా ఉంచుతాయి. వాల్నట్స్ తింటే నిద్రబాగా పడుతుంది.
అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్ర నాణ్యతను పెంచుతాయి.
చిలగడదుంపల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నిద్ర నాణ్యతను పెంచుతాయి.
గోరు వెచ్చని పాలు తాగితే నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. ఇందులోని ట్రిఫ్టోఫాన్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో నిద్ర పడుతుంది.
నిద్రపోవడానికి ముందు కాఫీ, టీలు తాగొద్దు. ఇవి నాడీ వ్యవస్థను యాక్టివ్ చేసి నిద్రను దూరం చేస్తాయి.






