
గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా సిద్ధమవుతున్న వేళ, మహారాష్ట్ర ముంబయి నగరంలోని జీఎస్బీ సేవా మండల్ గణేశ్ మండపానికి రూ.703.27 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్నద గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా సిద్ధమవుతున్న వేళ, మహారాష్ట్ర ముంబయి నగరంలోని జీఎస్బీ సేవా మండల్ గణేశ్ మండపానికి రూ.703.27 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్నది. గత ఏడాదితో పోలిస్తే ఇది భారీగా పెరిగిన మొత్తమని నిర్వాహకులు తెలిపారు. ఈ మండపం గత 70 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రత్యేకంగా 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి ఆభరణాలతో గణపతి విగ్రహాన్ని అలంకరించనున్నారు. ఈ బీమా మొత్తం ఈ విగ్రహానికి, ఆభరణాలకు సంబంధించిన రక్షణ కోసం తీసుకున్నది. గత సంవత్సరం రూ.474 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ, ఈసారి పెరిగిన బీమా మొత్తం గణపతి విగ్రహాన్ని అందించే భద్రతను పెంచడానికి అవసరమైంది. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుండి 18 వరకు కింగ్స్ సర్కిల్లో జరగనున్నాయి. అయితే, సంప్రదాయంగా జరిగే గణేశ్ నవరాత్రులు పది రోజుల పాటు జరగాల్సి ఉన్నప్పటికీ, ఈ ఏడాది ఐదు రోజుల పాటు మాత్రమే మండపంలో గణపతిని ఉంచాలని నిర్ణయించారు. ఆ తర్వాత నిమజ్జనం చేయాలని నిర్వాహకులు తెలిపారు. జీఎస్బీ సేవా మండల్ ప్రతినిధి అమిత్ పాయ్ మాట్లాడుతూ, ఈ ఏడాది గణేశ్ మండపానికి తీసుకున్న బీమా కవరేజీ భక్తుల భద్రతను నిర్ధారించడానికి అవసరమని తెలిపారు. ఈ ఉత్సవాల్లో రోజుకు 40,000 మందికి అన్నదానం అందించనున్నామని, మొత్తం ఐదు రోజుల్లో 2 లక్షల మందికి పైగా ప్రసాదం అందిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, డిజిటల్ రసీదులను ప్రవేశపెట్టడం ద్వారా కాగితపు వ్యర్థాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.





