
హైదరాబాద్ ఇబ్రహీంపట్నం కేంద్రంగా ‘QVSE’ పేరుతో నిర్వహించిన ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ద్వారా భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. డాలర్ల రూపంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దండుమైలారం, రాయపోల్, పోల్కంపల్లి, నాగన్‌పల్లి గ్రామాలకు చెందిన వేలాది మంది ఈ మోసానికి బలైనట్లు సమాచారం. దండుమైలారంలోనే సుమారు 800 మంది, రాయపోల్‌లో 400 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అధిక రాబడుల ఆశతో కొందరు బంగారం తాకట్టు పెట్టగా, మరికొందరు అప్పులు చేసి మరీ యాప్‌లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు బాధితులు చెబుతున్నారు.






