
వాషింగ్టన్‌: చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ పిలుపు మేరకు మాగులూరి భానుప్రకాశ్‌ సమన్వయంతో అమెరికా రాజధాని ప్రాంతంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించారు. ఆనాటి దుశ్చర్యను గుర్తు చేసుకుంటూ.. అప్రజాస్వామిక పాలన విధానాన్ని ఖండించారు. కొవ్వొత్తులు వెలిగించి.. చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అధికారం, పదవులకు అతీతంగా ప్రజాస్వామ్య పాలనా స్ఫూర్తిని పాటిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భానుప్రకాశ్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అర్ధరాత్రి అప్రజాస్వామికంగా అరెస్టు చేసి, 53 రోజుల పాటు రిమాండ్‌ విధించారని అన్నారు. అయినప్పటికీ.. ఆయన పోరాట స్ఫూర్తిని, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేకపోయారని తెలిపారు. చంద్రబాబు కోసం ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రవాస తెలుగు భారతీయులు మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు. పలువురు ప్రవాస పెద్దలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడేందుకు కలిసి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, భాజపా నేతలకు అభినందనలు తెలుపుతూ.. కూటమి ఐక్యత ఇకముందూ కొనసాగాలని ఆకాంక్షించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






