
నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల నుంచి వ్యర్థాలు, అదనపు ఉప్పు బయటకు తొలగుతుంది. దీంతో కిడ్నీలు డీటాక్స్ అవుతాయి. కిడ్నీలు హెల్తీగా మారుతాయి.
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. తాజా ఆహారం తినడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా మారుతాయి. కిడ్నీ సమస్యలు తగ్గుతాయి.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీని వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా మారుతాయి.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్‌ను తాగడం వల్ల రక్తంలో నికోటిన్ స్థాయిలు పెరుగుతాయి. కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఆల్కాహాల్ ఎక్కువగా తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీంతో కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆల్కాహాల్‌కు దూరంగా ఉండండి.
వైద్యుడి సూచనలు లేకుండా పెయిన్ కిల్లర్స్ ఉపయోగించడం వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
ప్రతి రోజూ 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. దీని వల్ల కణాలు రిపేర్ అవుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.