
బీట్రూట్లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుందని హెల్త్‌లైన్ తెలిపింది.
సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ప్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల గోడలను బలంగా ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను విస్తరింపచేస్తాయి. దానిమ్మ తింటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనంతో పాటుగా నైట్రేట్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది.
వాల్‌నట్స్‌లో ఆల్పా లినోలెనిక్ యాసిడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.





