
భూమి పూజ చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బనగానపల్లి, న్యూస్‌టుడే: గత వైకాపా సర్కారు కక్షగట్టి అభివృద్ధి పనులు నిలిపివేసిందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలో ఆగిపోయిన ఇండోర్‌ స్టేడియం పనులకు మంత్రి బీసీ బుధవారం భూమి పూజ చేశారు. వైకాపా హయాంలో నిలిచిపోయిన స్టేడియం పనులను ప్రస్తుత ప్రభుత్వంతో అనుమతి తీసుకొని రూ.2 కోట్లు మంజూరు చేయించానని అన్నారు. నియోజకవర్గంలో అప్పట్లో కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి రోడ్డు నిర్మించాలని నిధులు తెస్తే కోర్టుకు వెళ్లి పనులు ఆపినట్లు తెలిపారు. జుర్రేరు ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మార్చిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు బురానుద్దీన్, ఖాసీంబాబు, శంకేశ్వరరెడ్డి, తులసిరెడ్డి, కలాం, సలాం, సైదుహుసేన్‌ పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





