
ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా పౌరులే లక్ష్యంగా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌ ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ కేంద్రంగా నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసుకొని అమెరికా పౌరులను మోసం చేస్తున్న ఉదంతానికి సంబంధించి ఈడీ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. దీని దర్యాప్తులో భాగంగా పంజాబ్‌లోని చండీగఢ్, పాటియాలా, పుణెలలో ఏర్పాటు చేసిన నకిలీ కాల్‌సెంటర్లలో మంగళవారం సోదాలు నిర్వహించినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాటియాలాలో రెండు, పుణెలో ఒక కాల్‌సెంటర్‌ సోదాల్లో మొత్తం 220 మంది పనిచేస్తున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





