
లాస్ఏంజిల్స్ : అమెరికాలోని లాస్ఏంజిల్స్లో మంగళవారం బస్సు, ఎస్యూవీ ఢీకొన్న ఘటనను కవర్ చేస్తున్న ఎన్బీసీ న్యూస్‌కు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శాన్ ఫెర్నాండో వ్యాలీలోని చాట్స్వర్త్ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో పైలట్ జార్జ్ మార్కినియాక్, ఫొటో జర్నలిస్ట్ ఎలియానా మోరెనో ఉన్నారు. అది కూలిన సమయంలో కిందనున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.




