
సూడాన్‌లోని వెస్ట్‌ కోర్దోఫ్యాన్‌ ప్రావిన్స్‌లో బంగారు గని కూలి.. 67 మంది మృతి చెందారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇంకా అనేక మంది గనిలో చిక్కుకుపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఆఫ్రికాలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో సూడాన్ ఒకటి. అయితే, అక్కడి బంగారం అధిక భాగం ప్రమాదకరమైన చిన్న తరహా (ఆర్టిజనల్) మైనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడి, దేశం నుంచి అక్రమంగా తరలించబడుతోంది.





