
సిమిలిగుడ: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహాన్ని దాటుకుంటూ వెళ్లి.. ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు ఆ గ్రామస్థులు, బంధువులు. వివరాల్లోకి వెళితే.. దేబో సోండో గుడ గ్రామంలో మంగళవారం సాయంత్రం పటేఖారా అనే వృద్ధుడు మృతి చెందాడు. ఆ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించాలంటే బసుఖి నది అవతల ఒడ్డులో ఉన్న శ్మశానవాటికకు తీసుకెళ్లాలి. అయితే అక్కడికి వెళ్లేందుకు వంతెన లేదు. మరోవైపు కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ సమితి రాయ్‌సింగ్‌ పంచాయతీ దేబో సోండో గుడలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బసుఖి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. గ్రామస్థులు, బంధువులు ప్రాణాలకు తెగించి, ఒకరి చేయి ఒకరు పట్టుకుని నదిని దాటుకుంటూ వెళ్లి, ఆ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ కష్టాలు తప్పడం లేదని, ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నదిపై వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





