
తాండూరు గ్రామీణం: రెండు రోజుల క్రితమే వివాహం నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం తాండూరు మండలం జినుగుర్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగలక్ష్మి(21) డిగ్రీ, నర్సు కోర్సు పూర్తి చేసింది. ఏడాది క్రితం తల్లి మృతి చెందడంతో తన తండ్రి అంజిలాప్పకు చేదోడు వాదోడుగా పనులు చేస్తూ ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే నాగలక్ష్మికి వివాహం చేసేందుకు తన తండ్రి.. సిరిగిరిపేటకు చెందిన ఓ యువకుడితో ఆదివారం నిశ్చితార్థం జరిపించారు. మంగళవారం తండ్రీ, కుమార్తెతో కలిసి పట్టణానికి వెళ్లి సామగ్రిని కొనుగోలు చేశారు. తండ్రి నిద్రించాక.. నాగలక్ష్మి ఇంట్లోనే గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన ఆమె తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.