
ఇంటర్నెట్‌ డెస్క్‌: సూడాన్‌(Sudan)లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ కొర్దోపాన్‌ ప్రావిన్సులోని నుహుద్‌ పట్టణంలో బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలింది. అల్‌-జారా గనిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు 67 మంది మృతిచెందినట్లు వైద్య బృందం, ప్రాణాలతో బయటపడినవారు తెలిపారు. ఇంకా పలువురి ఆచూకీ లభించలేదు. గని శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతం ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (rsf) ఆధీనంలో ఉంది. సూడాన్‌ సైన్యం, ఆర్‌ఎస్‌ఎఫ్‌ మధ్య మూడేళ్లుగా పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితులు క్లిష్టంగా మారాయి. కార్మికులు, స్థానిక ప్రజలు సాధారణ పారలు, గునపాలు ఉపయోగించి శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.