
Narasaraopet Mp Lavu Srikrishna Devarayalu On BJP leader Nagabhushanam: మంగళవారం చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంలో రూ.2.34 కోట్లతో నిర్మించనున్న కరివేపాకు ప్రాసెసింగ్ ప్లాంట్ కు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ గురించి ప్రస్తావిస్తూ ఎంపీ దేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీనేత నాగభూషణం కరివేపాకు వ్యాపారం గురించి ప్రస్తావించారు. ఆయన కరివేపాకు వ్యాపారం చేసి ఏకంగా రూ.కోట్లలో సంపాదించారని చెప్పుకొచ్చారు.





