
ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం: వైకాపా నేత, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఆయన తనయుడు చిరంజీవి నాగ్‌ బుధవారం తాడేపల్లిలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. చిరంజీవి నాగ్‌ మంగళవారం వైకాపా నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారుడి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు సమాచారం. జిల్లాలో ఇటీవల గొర్లె కిరణ్‌కుమార్‌ వ్యాఖ్యలు, వైకాపా ప్రతిష్ఠను దెబ్బతీసేలా ధర్మాన సోదరులు వ్యవహరిస్తున్న తీరును తమ్మినేని సీతారాం జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఎవరేమనుకున్నా ఎంపీ అభ్యర్థి మీరే అంటూ తమ్మినేని సీతారాంకి జగన్‌ చెప్పినట్లు సమాచారం. డీలిమిటేషన్‌ ప్రక్రియ జరిగినా.. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా కీలక బాధ్యతలు అప్పగిస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ భేటీలో శ్రీకాకుళం జిల్లా వైకాపా సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





