
వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను ఈజీగా కరిగిస్తాయి.
పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఈజీగా కరిగిపోతుంది. దీనికోసం ప్రతిరోజూ ఉదయం పసుపు టీ తాగితే సరిపోతుంది.
మెంతుల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది పేగులు, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు రక్షణ కల్పిస్తాయి.
గ్రీన్ టీలోని కెటాచిన్స్ శక్తివంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. అలాగే గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు మేలు చేయడంలో సహాయపడతాయి.
ఆలివ్ ఆయిల్లో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెను రక్షిస్తాయి.
యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే ఫైబ్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను శోషించుకుని రక్తంలో లిపిడ్ లెవెల్స్ తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బాదం, వాల్నట్స్, గుమ్మడి, అవిసె లాంటి గింజల్లో స్టిరాల్స్, మెగ్నీషియం, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్త నాళాలను శుభ్రంగా మారుస్తాయి.





