
అభాగ్యులకు సీఎం సహాయనిధి ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం పోలాకి మండలంలోని కత్తిరివానిపేటలోగల క్యాంపు కార్యాలయంలో నరసన్నపేట మండలంలోని ఉర్లాం గ్రామానికి చెందిన నడిమిండి దుర్గారావుకు సీఎం సహాయక నిధి కింద రూ.1,17,700 చెక్కును పంపిణీ చేశారు.





