
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మ కణాలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం యవ్వనంగా ఉంటుంది. అందుకే అద్భుతమైన చర్మ సౌందర్యం కోసం ఉసిరి జ్యూస్ తాగడం చాలా మంచిది.
పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని మెరిపిస్తాయి. అందుకే రోజూ పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం చాలా మంచిది
శరీర వేడిని తగ్గించడంతో పాటు చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ధనియాల నీళ్లు సహాయపడతాయి. దీనికోసం రాత్రంతా నానబెట్టిన ధనియాల నీళ్లను ఉదయం వడబోసి తాగితే సరిపోతుంది.
జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా అందాన్ని పెంచడంలో సోంఫు టీ సహాయపడుతుంది. దీనికోసం నీళ్లలో సోంఫు వేసి మరిగించి తాగితే సరిపోతుంది.
చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపర్చి విష పదార్థాలను బయటకు పంపడంలో ఈ టీ సహాయపడుతుంది. దీనికోసం నీళ్లలో అల్లం ముక్కలు, తులసి ఆకులు మరిగించి తాగితే సరిపోతుంది.
తాజా అలోవెరా నుంచి రసం తీసి అందులో కొద్దిగా పుదీనా, తులసి ఆకులు కలిపి తాగితే చర్మం పూర్తిగా డీటాక్స్ అవుతుంది. తద్వారా అందంగా కనపడొచ్చు.
పేగులను పూర్తిగా క్లీన్ చేసి శరీరాన్ని డీటాక్స్ చేయడంలో నిమ్మరసం సహాయపడుతుంది. అందుకో ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే అందం రెట్టింపు అవుతుంది.
కీరదోస నుంచి రసం తీసి అందులో కొద్దిగా నిమ్మరసం, వేయించిన జీలకర్ర పొడి కలిపి తాగితే చర్మానికి చాలా మంచిది. ఇది స్కిన్ గ్లో పెంచడంలో సహాయపడుతుంది.
కుంకుమపువ్వు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మం యవ్వనంగా ఉండాలని కోరుకునే వారు ప్రతిరోజూ ఓ గ్లాసు కుంకుమపువ్వు పాలు తాగితే మంచిది.





