
బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లోని ఓ ఇంట్లోకి ఏకంగా కారుతోనే వెళ్లొచ్చు. రెండు, మూడు అంతస్తుల వరకు వెళ్లి బెడ్‌రూమ్‌లోనే పార్క్‌ చేయొచ్చు. అంత ప్రత్యేకం గనకే స్థానికులు ఆ బంగళాని ‘అమెరికన్‌ హౌస్‌’, ‘డాలర్‌ విల్లా’ అని పిలుస్తుంటారు. అమెరికాలో స్థిరపడిన అజయ్‌సింగ్‌ తనకు నచ్చినట్టుగా నిర్మించుకున్నారు. స్విమ్మింగ్‌పూల్, ఫౌంటెన్, హైడ్రాలిక్‌ లిఫ్ట్, సెంట్రలైజ్డ్‌ ఏసీ సౌకర్యాలతో విలాసంగా ఉంటుందీ భవంతి. దీన్ని రూ.35 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటంతో వార్తల్లోకి వచ్చింది.





