
వినాయక చవితి పర్వదినం సందర్భంగా అనకాపల్లి జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెంకటేష్, పెన్సిల్ మొనపై 6 మి.మీ. వెడల్పు, 12 మి.మీ. ఎత్తుతో విఘ్నేశ్వరుడి రూపాన్ని చెక్కి అబ్బురపరిచారు. అమెరికాలో రోడ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్, రెండు గంటల శ్రమతో ఈ అద్భుత కళాఖండాన్ని భక్తులకు అంకితం చేశారు.





