పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు పాయకరావుపేట, ఎలమంచిలి, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే కోనవానిపాలెం వద్ద అక్రమ లేఅవుట్‌ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి జోరందుకుంది. దీంతో స్థిరాస్తికి డిమాండ్‌ పెరుగుతోంది. దీనిని అవకాశంగా చేసుకుని గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు పాతరేసి కొనుగోలుదారులకు పాట్లు మిగుల్చుతున్నారు. పంచాయతీలకు ఆదాయం, స్థలాలు రెండూ లేకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిని ఆనుకుని వందల సంఖ్యలో లేఅవుట్లు కనిపిపిస్తుంటే.. అన్ని అనుమతులు ఉన్నవి పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా లేఅవుట్ల ఏర్పాటులో గ్రామ, మండలస్థాయి అధికారులకు భాగస్వామ్యం ఉండటం విశేషం. పాయకరావు పేట నియోజకవర్గ పరిధిలో 400 ఎకరాలకు పైగా లేఅవుట్లు వెలిశాయి. ప్రభుత్వం లేఅవుట్లకు అనుమతులు సులభతరం చేసినా రియల్టర్లు పట్టించుకోవడం లేదు. పంచాయతీ, వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు పొందకుండానే వెంచర్లు వేస్తున్నారు. రోడ్డుతో సరిపెట్టిన పి.ఎల్‌.పురం లేఅవుట్‌ ఇప్పటికే అక్రమ లేఅవుట్లను సర్వే చేసి గుర్తించాం. వీటిల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని అనుమతులు ఉన్న వాటిల్లోనే స్థలాలు కొనుగోలు చేయాలి. నిబంధనలు సక్రమంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాం. పరిశీలించకుండా అనుమతులు జారీ చేస్తే చర్యలు తప్పవు. సందీప్, జిల్లా పంచాయతీ అధికారి .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.