
Road Accident | బిడ్డకు పెండ్లి కుదురడంతో ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపాలనుకున్నా ఆ తండ్రి ఆశలు అడియాసలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు దుర్మరణం చెందడతో మంగళవాయిద్యాలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పు కొట్టాల్సి వచ్చింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి(Mailardevpally) పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..తండ్రి, కుమార్తె మృతి చెందారు. బైక్పై వెళ్తున్న తండ్రి, కూతురును వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో(Road accident ) ఇద్దరు అక్కడికక్కడే మతి చెందారు. కుమార్తెకు పెళ్లి ఖాయంకావడంతో సామాన్లు తీసుకురావానికి బైక్పై తండ్రి కూతురు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన టిప్పర్ వారి బైక్ను వెను కనుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





