
ఏర్పేడు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం ఏర్పేడు-వెంకటగిరి ప్రధాన రహదారిపై పల్లంపేట సమీపంలో జరిగింది. పల్లంపేటకు చెందిన కల్యాణ్ (29) పురోహితుడు. పనులు ముగించుకుని వెంకటగిరి నుంచి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గంమధ్యలో పల్లంపేట సమీపంలో కల్యాణ్‌ ప్రయాణిస్తున్న బైక్‌ను ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో కల్యాణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





