
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రకాశం రోడ్డులో అంగన్వాడీ కార్యకర్త అన్నం లావణ్య (45) హత్యకు గురయ్యారు. లావణ్య, ఆమె భర్త నరేశ్‌ మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో బుధవారం ఉదయం ఇంటి పని చేస్తుండగా లావణ్యను నరేశ్‌ రుమాలుతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





