
ఇక భవిష్యత్తులో కొన్ని నిమిషాల తర్వాత ట్రాఫిక్ ఎలా ఉండొచ్చో అంచనా వేయడానికి చారిత్రక ట్రాఫిక్ నమూనాలతో పాటు ప్రస్తుత పరిస్థితులను కూడా AI, మెషిన్ లెర్నింగ్ మోడళ్ల ద్వారా విశ్లేషిస్తుంది. అందుకే మీరు ఒక రూట్లో బయలుదేరిన తర్వాత ముందున్న రోడ్డులో ట్రాఫిక్ పెరుగుతుందని గుర్తిస్తే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా మ్యాప్స్ సూచించగలదు.





