
కావలి: రహదారి ప్రమాదాల్లో బాధితులను తొలిగంటలో ఆసుపత్రికి తరలించి కాపాడే వారికి రూ.25వేల ఆర్థిక సహాయం లభిస్తుందని కావలి రవాణా అధికారి మురళిధర్, ఎంవీఐ ఆర్.సుందరరావు తెలిపారు. బుధవారం కావలి కార్యాలయంలో రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ‘రహ-వీర్‌’ పథకం ద్వారా ప్రోత్సహకం అందుతుందన్నారు. దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో ఏటా పదిమంది రహ-వీర్లను ఎంపిక చేసి వారికి రూ.లక్ష బహుమతి, ప్రశంసాపత్రం అందజేస్తారన్నారు. ఆయా ప్రమాదాల్లో కాపాడిన వారికి పోలీసులు లేక ఆసుపత్రి వైద్యుల నుంచి తగిన గుర్తింపుపత్రం పొందవచ్చన్నారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు ప్రతినెలా సమావేశమై ఈ ప్రతిపాదనలు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారన్నారు. ప్రోత్సహక మొత్తాలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





