ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం వీడియో వైరల్ అవుతుంది. వీధి మధ్యలో వర్షపు నీటితో నిండి ఉన్న ఒక పెద్ద గుంతను గమనించని డెలివరీ ఏజెంట్.. తన బైక్‌తో సహా అందులో పడిపోయాడు. బైక్ క్షణాల్లో లోతైన గుంతలో మునిగిపోగా, ప్రమాదాన్ని గమనించిన బాటసారులు, స్థానికులు వెంటనే స్పందించి డెలివరీ బాయ్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ వీడియో చూసి రోడ్ల నిర్వహణపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




