
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని జాతీయ రహదారిపై సిరి హాస్పిటల్ సమీపంలో నాగుపాము కనిపించింది. సమీపంలోని ఓపెన్ ప్లాట్ చెట్ల పొదల నుంచి బయటకు వచ్చిన పాము రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అయితే రోడ్డు మధ్యలోని డివైడర్ అడ్డురావడంతో అక్కడే పడగవిప్పింది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై నాగు పామును చూసి వాహనదారులు, పాదాచారులు భయాందోళనకు గురయ్యారు. వాహనదారులు నెమ్మదిగా రోడ్డు పక్కనుంచి వెళ్లగా, మరికొందరు అరగంట పాటు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆ పాము తిరిగి చెట్ల పొదల్లోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Recommended for you

politicsరోడ్డుప్రమాదంలో యువకుడి మృతి




