
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్కు చెందిన ఓ బ్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘నవరాత్రి’ పేరుతో రూపొందించిన ఈ బ్యాగ్ ధర రూ.8.3 లక్షలుగా ఉండటమే దీనికి కారణం.
© 2026 nimisham.in

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్కు చెందిన ఓ బ్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘నవరాత్రి’ పేరుతో రూపొందించిన ఈ బ్యాగ్ ధర రూ.8.3 లక్షలుగా ఉండటమే దీనికి కారణం.
ఇంటర్నెట్‌ డెస్క్‌: లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌కు చెందిన ఓ బ్యాగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నవరాత్రి’ (Navratri) పేరుతో రూపొందించిన ఈ బ్యాగ్‌ ధర ఏకంగా రూ.8.3 లక్షలు ఉండటమే దీనికి కారణం. ఈ బ్యాగ్‌ డిజైన్‌ గుజరాత్‌ వీధుల్లో కనిపించే సంప్రదాయ బ్యాగులను పోలి ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అతి తక్కువ ధరకు లభించే బ్యాగ్‌కు భారీ ధర నిర్ణయించడంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ కళలు, హస్తకళలను విదేశీ లగ్జరీ బ్రాండ్లు ఉపయోగించుకుంటున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గొయెంకా (Harsh Goenka) తీవ్రంగా స్పందించారు. ‘‘ప్రాడా, కొల్హాపురి చెప్పుల వివాదం తర్వాత ఇప్పుడు ఈ బ్యాగ్‌ చర్చకు వచ్చింది. గుజరాత్‌ వీధుల్లో రూ.500కు లభించే బ్యాగ్‌ డిజైన్‌కు రూ.8.3 లక్షలు వసూలు చేస్తున్నారు. దానిని కనిపెట్టిన భారతీయ కళాకారులకు ఎలాంటి గుర్తింపునివ్వడం లేదు. లగ్జరీ బ్రాండ్లు మన కళలను ఇలా ఉపయోగించుకోవడం ఎప్పుడు ఆపుతాయో? అని ఆయన ప్రశ్నించారు. బయోకాన్‌ అధినేత కిరణ్‌ మజుందార్‌ షా (Kiran Mazumdar Shaw) కూడా దీనిపై స్పందించారు. ‘‘భారతీయ సంప్రదాయ కళను లగ్జరీ ఉత్పత్తిగా మలిచి.. మళ్లీ ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. దాన్ని సృష్టించిన కళాకారులకు గుర్తింపు ఇవ్వకపోవడం సరైంది కాదు’’ అని ఆమె పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








