
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌లో సెపెహ్రాన్‌ ఎయిర్‌లైన్స్‌ (Sepehran Airline)కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. మషద్‌ నుంచి విమానం టేకాఫ్‌ అయిన తర్వాత గాల్లో ఓ టైరు ఊడిపోయింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం (Iran flight) ఇరాన్‌లోని మషద్‌ (Mashhad Airport) నుంచి కెర్మాన్‌షాకు బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఓ టైరు ఊడిపోయినట్లు పైలట్లు గుర్తించారు. అదే సమయంలో ఇంజిన్‌లోనూ సమస్య తలెత్తింది (Engine Malfunction). ఒకే ఇంజిన్‌తో ప్రయాణం కొనసాగించడం ప్రమాదకరమని భావించిన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. మషద్‌కు చేరుకున్న తర్వాత ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేస్తుండగా రన్‌వేపై విమానం భారీ కుదుపులకు లోనయ్యింది. లగేజీ క్యాబిన్లు తెరుచుకుని.. బ్యాగులు ప్రయాణికులపై పడిపోయాయి. దీంతో వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. లగేజీలు పడడంతో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. వారికి ప్రాథమిక చికిత్స అందించినట్లు ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సెపెహ్రాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.





