
Bairanpally Matrys | మద్దూరు (ధూళిమిట్ట), సెప్టెంబర్ 15 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ధూళిమిట్ట మండలంలోని బైరాన్ పల్లిలో ఈ నెల 17వ తేదీన అమరవీరుల సంస్మరణ సభను ఏర్పాటు చేసినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం సీపీఎం నాయకులు బైరాన్ పల్లి గ్రామాన్ని సందర్శించి, బురుజు వద్ద ఏర్పాటు చేయనున్న సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అమరవీరుల సంస్మరణ సభకు సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు ముఖ్య అతిథితులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ పోరాటంలోబైరాన్ పల్లి పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. బైరాన్ పల్లి పోరాట స్పూర్తితో ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు. బైరాన్ పల్లిలో జరుగుతున్న అమరవీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, కొంగరి వెంకట్‌మావో, ఆలేటి యాదగిరి, చొప్పరి రవికుమార్, మండల కార్యదర్శులు ఎండీ షఫీ, పోతిరెడ్డి రాజు, నాయకులు తప్పతి రాజు, వేల్పుల విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్ హయత్‌నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు