
వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies cricket Team) తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం సాయంత్రం జట్లను వెల్లడించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీకాలం పొడిగించకపోవడంతో ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఆఖరి ఎంపిక సమావేశం ఇదేననే వార్తల నేపథ్యంలో అందరి దృష్టీ ఈ ప్రకటనపై పడింది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే జట్టులో కొనసాగుతుండగా, స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh pant) కు మాత్రం నిరాశే మిగిలింది. ఆయనను పక్కనబెట్టిన సెలెక్టర్లు బ్యాకప్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కు అవకాశం కల్పించారు. పంత్‌ను ఇరానీ కప్ (Irani Cup) లో రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest of India) కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మరోవైపు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో జట్టులోకి రాలేదు.




