
ముంచంగిపుట్టు మండలం వర్కుగుమ్మి గ్రామానికి పీఎం జన్మన్ కింద సుమారు 30 ఇళ్లు మంజూరయ్యాయి. గిరిజనులు స్లాబ్ దశవరకు పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రత్యేక ప్రోత్సాహకాలు అందకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయాయి.
© 2026 nimisham.in

ముంచంగిపుట్టు మండలం వర్కుగుమ్మి గ్రామానికి పీఎం జన్మన్ కింద సుమారు 30 ఇళ్లు మంజూరయ్యాయి. గిరిజనులు స్లాబ్ దశవరకు పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రత్యేక ప్రోత్సాహకాలు అందకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయాయి.
ఏడాదిన్నరగా అందని ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇళ్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం ఈనాడు డిజిటల్, పాడేరు ముంచంగిపుట్టు: కించాయిపుట్టు పంచాయతీ వర్కుగుమ్మి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లు.. ముంచంగిపుట్టు మండలం వర్కుగుమ్మి గ్రామానికి పీఎం జన్‌మన్‌ కింద సుమారు 30 ఇళ్లు మంజూరయ్యాయి. గిరిజనులు స్లాబ్‌ దశవరకు పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రత్యేక ప్రోత్సాహకాలు అందకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయాయి. ఆఖరు విడత నిధులు విడుదల అయితే సగానికి పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని గ్రామస్థులు చెబుతున్నారు. గిరిజనుల సొంతింటి కల నెరవేరడంలేదు. పక్కా ఇళ్లు ప్రకటించి ఏడాదిన్నర దాటుతున్నా ఇంకా అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. దీంతో పూరిళ్లు, షెడ్లలో గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. విష పురుగులు, పాముల బెడద తీవ్రంగా ఉంటుంది. వర్షాకాలం వస్తే మట్టిగోడలు ఎప్పుడు పడిపోతాయో తెలీదు. ఇళ్ల నిర్మాణాలకు కేటాయించిన అదనపు సాయం విడుదల చేస్తే పనులు పూర్తి చేసుకుందామని ఎదురుచూస్తున్న వారికి అంతిమంగా నిరాశే ఎదురవుతోంది. మన్యంలో ఉన్న భిన్న భౌగోళిక పరిస్థితుల కారణంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణాలకు ఎక్కువ మొత్తం ఖర్చుచేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం చాలకపోవడంతో గిరిజనులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. ఈ విషయం గ్రహించిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోపాటు సాధారణ గిరిజనులకు రూ. 75 వేలు, పీవీటీజీలకు రూ. లక్ష చొప్పున అదనపు సాయం ఇస్తామని ప్రకటించింది. దీంతో ఎంతో ఆనందపడిన గిరిజనులు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ.. ఏడాదిన్నరగా ప్రోత్సాహం అందక ఎక్కడ పనులు అక్కడ ఆపేశారు. జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై), పీఎం జన్‌మన్‌ కింద 70 వేలకుపైనే మంజూరయ్యాయి. ఇందులో కేవలం మూడోవంతు కూడా పూర్తవలేదు. పీఎంఏవై ఇళ్లలో సగం వరకు పూర్తయినా.. జన్‌మన్‌ పథకంలో మాత్రం వేళ్లమీద లెక్కెట్టే స్థాయిలోనే పూర్తయ్యాయి. వీటిలోనూ చాలామంది లబ్ధిదారులకు ప్రత్యేక ప్రోత్సాహక నిధులు రాలేదు. దీనికితోడు గృహ నిర్మాణ సంస్థ పరిధి అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకే ఒక్క డీఈ జిల్లాలో జరుగుతున్న పనులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








