
మోపిదేవి, కోడూరు - న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను ఇటీవల మార్పు చేసింది. పంచాయతీల్లో స్వర్ణ గ్రామం, మునిసిపాలిటీలలో స్వర్ణ వార్డులుగా మార్చింది. ఈనేపథ్యంలో కొత్త పేర్లతో కూడిన బోర్డుల్ని ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేయడానికి తాజాగా డీఎల్‌డీవో కార్యాలయాలకు నామఫలకాలు సరఫరా అయ్యాయి. జిల్లాలో మొత్తం 508 కార్యాలయాలు ఉన్నట్లు డీఎల్‌డీవో కార్యాలయ అధికారులైన పద్మ, రవికాంత్‌ తెలిపారు. కృత్తివెన్ను తదితర మండలాల్లో ఇప్పటికే బిగించినట్లు తెలిపారు. మిగిలిన మండలాల్లో కూడా త్వరితగతిన పూర్తిచేయనున్నట్లు వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.