
కూటమి పార్టీల్లో ఆశావహుల పోటాపోటీ అవకాశమివ్వాలని ముఖ్య నేతల వద్దకు వరుస ఈనాడు, అమరావతి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభ సూచనలతో గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానంగా మేయర్‌ అభ్యర్థిగా అవకాశాన్ని దక్కించుకునేందుకు అధికార కూటమికి చెందిన ఆశావహులు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. దీంతో గుంటూరు మేయర్‌ సీటు ఎవరిని వరిస్తుందనే అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి స్థానిక సమరం కావడంతో కూటమి నేతల్లో ఆశలు రెట్టింపయ్యాయి. మూడు పార్టీల నుంచి పోటీ వాతావరణం నెలకొనడమే కాకుండా, పార్టీల లోపల సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నడుస్తోంది. మేయర్‌ పీఠం దక్కేది ఎవరికనేది తేలాలంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కీలకపాత్ర పోషించనున్నాయి. నగర జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ ఖరారయ్యే వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





