
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే అ భం.. శుభం తెలియని చిరు ప్రాయం కామాంధుల చేతుల్లో నలిగిపోతోంది. యువత.. వృద్ధాప్యం అనే తేడా లేకుండా లైంగిక వాంఛ పురివిప్పుతోంది. జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతున్నాయి. పోక్సో కేసుల్లో జీవితఖైదు శిక్షలు పడుతున్నా మార్పు రావడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే 60కి పైగా కేసులు నమోదయ్యాయి. చిన్నారుల సంరక్షణకు అనేక విభాగాలు పని చేస్తున్నా.. తెలంగాణ మహిళా భద్రతా విభాగం మరో అడుగు ముందుకేసింది. పటిష్ఠ భద్రత కల్పించేందుకు ప్రత్యేక విభాగాల నియామకానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. భద్రాద్రి జిల్లాలో ఎస్సై, ఏఎస్సై, ఇద్దరు పీసీలతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. నేరాలను అరికట్టడం ప్రధాన బాధ్యతమహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. బాధితులకు అండగా నిలుస్తూ మహిళా భద్రతా బృందాలు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, కౌన్సెలింగ్‌ కేంద్రాల విభాగాలతో సమన్వయమవుతారు. నేరాల నివారణతో పాటు కేసుల దర్యాప్తు, పర్యవేక్షణలో నాణ్యత పెంచేందుకు శ్రమిస్తారు. బాధితులకు చట్టపరమైన సాయం అందించడం ఇతర సహాయ సేవల్లో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టడం ప్రత్యేక విభాగం ప్రధాన బాధ్యత. బాధితులకు తక్షణ సాయం అందించడంతో పాటు కేసుల దర్యాప్తు, పర్యవేక్షణ, అవగాహన, పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తారు. చిన్నారులు, మహిళలపై జరిగే అరాచకాలను కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యం. అందులో ప్రత్యేక విభాగం కీలక బాధ్యతలు పోషిస్తుంది. ప్రస్తుతం ఉన్న కమిటీలతో సమన్వయంగా వ్యవహరిస్తూ పటిష్ఠ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





