
ఖానాపురం హవేలీ: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌ తాళ్లూరి పిలుపునిచ్చారు. ఖమ్మంలో జనసేన తెలంగాణ శంఖారావం సభను ఆ పార్టీ అధికార ప్రతినిధి గడల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు ముందు ఖమ్మంలో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సభలో సినీ నటులు తనుశ్‌, సాగర్‌, రాష్ట్ర ఇన్‌ఛార్జి శంకర్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల సమస్యలను చర్చించకుండా రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు, రైతులు, యువత, విద్యార్థుల సమస్యలపై ఎళ్లవేళలా పోరాటాలు చేస్తామన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






