
కూటమి పాలనలో అభివృద్ధికి, పర్యాటకరంగానికి మారుపేరులా పల్నాడు(palnadu) జిల్లా రూపుదిద్దుకుంటోంది. ఒకవైపు ప్రకృతి అందాలు.. మరోవైపు కృష్ణమ్మ పరుగులు.. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఎత్తిపోతల జలపాతం ఇప్పుడు సాహస క్రీడలకు కేరాఫ్‌గా నిలవబోతోంది. ఇప్పటి వరకు ప్రకృతి ప్రేమికులకు ఓ అందమైన గమ్యంగా ఉన్న జలపాతం ఇకపై సాహస ప్రియులకు శాశ్వత చిరునామాగా నిలుస్తోంది. యువతను అడ్వెంచర్‌ రైడ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. జిప్‌లైన్, జిప్‌ సైక్లింగ్ వంటి సాహస క్రీడలను ఎత్తిపోతల జలపాతం వద్ద ఏర్పాటు చేయటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకులను సాహస క్రీడలు ఆకర్షిస్తున్నాయి. ఈ వార్త చదివారా: అనంత్‌ అంబానీ విరాళం.. తిరుమల చేరుకున్న 15 ఈవీ బస్సులు






