
బరగఢ్‌: బరగఢ్‌ జిల్లా పద్మాపూర్‌లో ఏబీసీడీ సంస్థ ఆధ్వర్యంలో 7 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించారు. భేఉరియా నుంచి ఇండోర్ స్టేడియం వరకు జరిగిన ఈ పోటీలో వివిధ ప్రాంతాలకు చెందిన 45 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మారథాన్‌లో సువర్ణ పూర్ జిల్లా సహాజ్‌బహాల్‌కు చెందిన రాధేశ్యామ్ హరిపాల్ 22 నిమిషాల్లో పరుగు పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. సువర్ణ పూర్ జిల్లా డుంగురిపాలికి చెందిన సుదర్శన్ పటేల్ 28 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానాన్ని, పద్మాపూర్ దేఉలి ప్రాంతానికి చెందిన సుమంత్ సానబర్షా 32 నిమిషాలతో మూడో స్థానంలో నిలిచారు. యువతలో క్రీడలపై ఆసక్తి, శారీరక దృఢత్వం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిపై అవగాహన కల్పించడమే ఈ మారథాన్ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
గుంతలమయంగా మారిన జాతీయ రహదారి
బరగఢ్‌: బౌద్ధ్‌ జిల్లాలోని 57వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. రహదారిపై భారీ గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. గుంతలు పెద్దవిగా మారుతున్నా సంబంధిత అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరగకముందే జిల్లా యంత్రాంగం, ఎన్‌హెచ్‌ అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






