
విశాఖపట్నం(ఎంవీపీకాలనీ), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రానికి రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఏపీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్‌ విశాఖ జోన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఎక్స్‌పో’ ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, వృత్తి నైపుణ్యం కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్, ఏపీ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు పి.భాస్కరరావు, కార్యదర్శి బి.సుబ్బారావు, విశాఖ జోన్‌ ఛైర్మన్‌ పి.శోభన్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





