
అమృతలూరు: వేమూరు నియోజకవర్గంలోని చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాలకు చెందిన 71 మంది బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.28,46,065 మంజూరయ్యాయి. వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు రిఫరెన్స్ లెటర్ ద్వారా ఈ బిల్లులు సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి చేరగా.. అధికారులు పరిశీలించి వైద్య ఖర్చులు మంజూరు చేశారు. చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందడంతో లబ్ధిదారుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





