దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. కుమార్తె మృతిపై న్యాయం పోరాటం చేస్తున్న తనను రాజకీయ ప్రేరేపిత వ్యక్తిగా చిత్రీకరించేందుకు యత్నించారని ఆరోపిస్తూ శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్‌లకు ఆమె తండ్రి సతీశ్ సాలియాన్ రూ.500 కోట్ల లీగల్ నోటీసు జారీ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ 3 నిమిషాల వ్యవధితో కూడిన వీడియో ద్వారా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.





